ప్రపంచం మొత్తం కరోనా బారినపడగా ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతుంది.. ఇది చాలదన్నట్లుగా ఈ గొడవలోకి భారత్‌ను కూడా లాగుతున్నారు.. ఇంతటితో ఆగకుండా సందుదొరికితే సవాలక్ష కారణాలను చూపెడుతూ భారత సైన్యాన్ని కవ్విస్తున్న పాకిస్దాన్ చర్యలు అందరికి తెలిసిందే.. ఒక వైపు ఉగ్రవాదులు, మరోవైపు కరోనా, ఇవి చాలవన్నట్లుగా నేపాల్ కూడా ప్రస్తుతం ఒక కొత్తపాట పాడుతుంది..

 

 

అదేమంటే అవసరమైతే ఇండియాతో యుద్ధం చేయడానికి తమ దేశ గూర్ఖా సైన్యం సిద్ధంగా ఉందని నేపాల్ మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో.. ఇక్కడ ఒక్కోదేశానికి ఉన్న అధికార దాహం కావచ్చు, ఆధిపత్యపోరు కావచ్చూ ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లేలా కనిపిస్తున్నాయి అసలే ఆర్ధికమాధ్యంతో అల్లాడిపోతున్న సమయంలో ఇలాంటి మాటలు మానసిక స్దైర్యాన్ని కోల్పోయోలా చేస్తాయి.. ఇప్పుడు కరోనాతో చేస్తున్న యుద్ధం చాలదన్నట్లుగా, మరిన్ని యుద్ధాలు చేసి సాధించేది ఏముందన్న ఆలోచనలు లేకుండా ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం..

 

 

ఇదిలా ఉండగా లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర తదితర ప్రాంతాలు తమవేనని నేపాల్ వాదిస్తున్న వేళ, భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే, ఇటీవల మాట్లాడుతూ, మరో దేశం తరఫున నేపాల్ వకాల్తా పుచ్చుకుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇండియాతో చైనా చేస్తున్న ప్రచ్ఛన్న యుద్ధంలో నేపాల్ చైనాకు అనుకూలంగా మారిపోయిందని కూడా అన్నారు. తమ దేశానికి అత్యవసరమైతే నేపాల్ సైన్యం స్వయంగా రంగంలోకి దిగాలే తప్ప, మరొకరిపై ఆధారపడరాదని వ్యాఖ్యానించారు. అయితే నరవాణే వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకున్నారో తెలియదు గానీ రాజకీయ ఉద్దేశాలతో తమ సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని నేపాల్ రక్షణ మంత్రి ఈశ్వర్ పోఖ్రేల్ విమర్శలు గుప్పించారు.

 

 

అంతే కాకుండా సమయం వచ్చినప్పుడు ఇండియాతో యుద్ధమే అవసరమైతే తమ సైన్యం సిద్ధంగా ఉందని, దీటుగా బదులిచ్చేందుకు వెనుకాడదని అన్నారు. తమ రాజ్యాంగాన్ని అనుసరించి, ప్రభుత్వం ఆదేశిస్తే, ఆర్మీ తన పాత్రను పోషిస్తుందని కటువు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కాలాపానీ విషయంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలే మార్గమని తాము నమ్ముతున్నామని, ద్వైపాక్షిక చర్చలకే మొగ్గు చూపుతామని ఆయన అనడం గమనార్హం.. ఏది ఏమైనా పక్కనున్న దేశాలు ఇలా కొట్టుకు చస్తుంటే శత్రు దేశాలకు బలాన్ని పెంచినట్లేగా అని అనుకుంటున్నారు కొందరు నెటిజన్స్..  

మరింత సమాచారం తెలుసుకోండి: