ఈ ఏడాది మనిషిపై ప్రకృతి, వైరస్ .. చివరికి క్రిమి కీటకాలు కూడా పగబట్టినట్టున్నాయి.. ఊపిరి తీసుకోని కష్టాలు తెచ్చి పెడుతున్నాయి.  ప్రస్తుతం దేశం మొత్తం కరోనాతో నానా కష్టాలు పడుతుంటే.. ఓ వైపు తుఫాన్ మరో వైపు రాకాసి మిడతలు దాడులు చేస్తున్నాయి.  అంఫాన్ తుఫాన్ తో అల్లకల్లోలం అయిన విషయం తెలిసిందే. దీని ఆస్తి, ప్రాణ నష్టం కూడా జరిగింది.  ఇప్పుడు రాకాసి మిడతలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది కేవలం రైతు సమస్యే కాదు భవిష్యత్ లో ఆహార కొరతకు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. పాకిస్థాన్ నుంచి భారత్‌కు దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. పంట పొలాలపై పడి భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది.

 

వీటికి మందులు పిచికారీ చేసిన్పటికీ కొద్ది సేపటి తర్వాత మళ్లీ విజృంభిస్తున్నాయట. ప్రస్తుతం ఇవి మహారాష్ట్రలోకి కూడా ప్రవేశించాయి. అంటే మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణకు కూడా ఇప్పుడు ముప్ప వాటిల్లే ప్రమాదం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాంతో తెలంగాణ రైతాంగంలో కలవరం మొదలైంది. అవి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని గుర్తించి అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

వేల కిలోమీటర్ల నుంచి దూసుకొస్తున్న ఈ రాకాసి మిడతల దండుతో అన్నదాతలో గుబులు మొదలైంది. ఒకవేళ ఈ మిడతలు తెలంగాణ దిశగా సాగితే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటీ అన్న విషయం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల రైతులు, అధికారులను అప్రమత్తం చేశారు. వాటిని పారదోలేందుకు అవసరమైన రసాయనాలతో సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: