ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల సమస్యలు దేశంలో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేస్తున్న సమయంలో మరొకరిపై మొహంతో వారు నిండు సంసారాన్ని నాశనం చేసుకోవడంతో పాటు వారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. వారి సుఖాలకు అడ్డు వస్తున్నారని సొంత వారిని చూడకుండా అంతమొందించటం కూడా జరుగుతోంది. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు అని వారి వారికే తెలియకుండా పోతుంది. అయితే ఇక అసలు విషయంలోకి వెళితే... 


తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఓ మహిళ తన భర్తను ఆయన ప్రియురాలితో ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. తన భర్త ప్రేయసి ఇంట్లో ఆమెతో కలిసి ఉన్న సమయంలో ఆ మహిళ వారిద్దరిని పట్టుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తిని తన భార్య బయటకు కొట్టుకుంటూ లాక్కొని వచ్చి అందరి ముందు చితకబాదింది. తన భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహిళ అతడు రోజు ఏం చేస్తున్నాడు అనే విషయంపై పెట్టింది.


ఇక ఇదే విషయంగా తాజాగా అతను తన ప్రేయసి ఇంట్లో ఉండగా కనుక్కొని వారిద్దరిని పట్టుకుంది. ఇకపోతే తన భర్త శ్రీనివాస్ ను ఆమె కొడుతున్న దృశ్యాలు లోకల్ టీవీ ఛానల్ లో ప్రసారం జరిగాయి. అలాగే తన భర్త ప్రేయసిపై కూడా ఆమె గొడవకు దిగిన సంఘటన దృశ్యాలు కూడా టీవీ న్యూస్ ఛానల్ లో ప్రసారమయ్యాయి. దీనితో వీరి పంచాయతీని పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. ఆ తర్వాత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల జోలికి పోకుండా మీ సంసారాన్ని, మీ జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తూ అందరిలో గౌరవ మర్యాదలు పొందవచ్చు. లేకపోతే ఇలా టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకునే వారు అవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: