ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతోమందిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. అయితే కరోనా  వైరస్ ను కట్టడి చేయడంలో అధికార వైసిపి పార్టీ పూర్తిగా విఫలం అయింది అని ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేతలు అందరూ తీవ్ర స్థాయిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇదే విషయాన్ని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

 


 కరోనా  వైరస్ కట్టడి లో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. బ్లీచింగ్ పౌడర్ చల్లి పారాసెట్మాల్ వేసుకుంటే కరోనా వైరస్ తగ్గిపోతుంది అని అవగాహన లేమితో ఈ మహమ్మారి వైరస్ విషయంలో అధికార పార్టీ ఎంతగానో నిర్లక్ష్యం వహించింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మరిన్ని అంశాలను లేవనెత్తుతు  విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం వైసిపి నేతలందరూ రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

 


 అంతే కాకుండా అధికార పార్టీ అండదండలతో రాష్ట్రంలో భూ మాఫియా కూడా రెచ్చిపోతుంది అంటూ విమర్శించారు చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రభుత్వం చివరికి బ్లీచింగ్ పౌడర్ లో కూడా అవినీతికి పాల్పడింది అంటూ ఎద్దేవా చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే భారీ మొత్తంలో విద్యుత్ చార్జీలను పెంచి జగన్ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచింది అంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు... టిడిపి అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ చార్జీలు పెంచలేదని అంతేకాకుండా విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని అంటూ కూడా చెప్పాము  అంటూ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక పన్నులు వేసి ఏం అభివృద్ధి చేశారు అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ప్రాథమిక హక్కులు లేవని ఆటవిక రాజ్యం కొనసాగుతుంది అంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: