దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ విస్తరిస్తున్న తరుణంలో కరోనా  వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా కీలక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సాధ్యమైనంత ఎక్కువమందికి కరోనా  నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని ప్రస్తుతం అటు ప్రభుత్వాలు ఐసీఎమ్ఆర్ కూడా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కాకుండా ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకునేందుకు గతంలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా  వైరస్ నిర్ధారిత పరీక్షలకు సంబంధించి మరోసారి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కీలక నిర్ణయం తీసుకుంది. 

 


 ఇప్పటికే ప్రైవేట్ ల్యాబ్ కు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన ఐసీఎంఆర్ 4,500 నిర్ణయించింది. అయితే తాజాగా ఈ టెస్ట్ లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది ఐ సి ఎం ఆర్. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. ప్రస్తుతం కరోనా  వైరస్ పరీక్షలకు సంబంధించిన కిట్లు  మార్కెట్ లో భారీగా అందుబాటులో ఉండటంతో పాటు అటు ప్రైవేటు ల్యాబ్ ల  మధ్య కూడా పోటీ ఉండటంతో... కరోనా  వైరస్ నిర్ధారిత పరీక్షలకు సంబంధించిన ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది అంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. 

 


 అందుకే ఈ విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులతో పరస్పర చర్చలు జరిపి వారి అంగీకారంతో ధర అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించుకోవడానికి వీలు ఉంటుంది అంటూ లేఖలో పేర్కొంది ఐసీఎంఆర్. కాగా ఇప్పటి వరకు దేశంలో 428 ప్రభుత్వ ప్రయోగశాలలు... 182 ప్రైవేట్ ల్యాబుల్లో  కూడా కరోనా  వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించేందుకు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయితే మే 26 నాటికి దేశంలో రోజుకి ఒక లక్ష కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం భారతదేశంలో ఉంది అని ఐ సి ఎం ఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ పరీక్షల సామర్థ్యాన్ని ఏకంగా రోజుకి రెండు లక్షలు నిర్వహించే వరకు పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాబోయే నెలల్లో కూడా ఈ మహమ్మారి వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఐసీఎంఆర్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: