ఈ మాయదారి కరోనా మహమ్మారి ఎప్పుడు పోతుందో కానీ మనిషికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు అర కోటి దాటిన కేసులు.. లక్షల్లో మరణాలు సంబవించాయి.  ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు.  దేశంలో కూడా కరోనా మహమ్మారి రోజు రోజుకీ ప్రబలిపోతుంది. తాజాగా ఓ చిన్నారి తన తల్లిగురించి పడుతున్న ఆవేదన చూస్తే మనసున్న ప్రతి మనిషి అయ్యో అని కన్నీరు పెట్టుకునేలా ఉంది.  బీహార్‌‌లోని ముజ్‌ఫర్‌‌పూర్‌‌ రైల్వే స్టేషన్‌లో తీసిన ఒక వీడియో అందర్నీ కంట తడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండ దెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని తన రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరి హృదయాలను కదిలించింది. 

 

శవంపై కప్పిన దుప్పటిని తీసి ఆమెను లేపేందుకు ప్రయత్నించిన పిల్లాడ్ని చూసి అక్కడి వారికి ఒక్కసారే దుఖఃం ఆపుకోలేకపోయారు.  తల్లి చనిపోయిందని తెలుసుకోలేని ఆ పిల్లాడు ఫ్లాట్‌ఫాం మొత్తం తిరుగుతూ ఆడుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  ముజ్‌ఫర్‌‌నగర్‌‌కు చెందిన ఒక మహిళ పనుల కోసం గుజరాత్‌ వలస వెళ్లింది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకపోవడంతో శ్రామిక్‌ రైలులో ముజఫర్‌‌నగర్‌‌కు బయలుదేరింది.  ఆమె బయలు దేరినప్పటి నుంచి తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులుపడింది.. అంతలోనే భయంకరమైన ఎండలు.. వడగాలితో తట్టుకోలేకపోయింది.

 

అంతే ఆమె ఆకలి, ఎండ దెబ్బతో చనిపోయింది.  ముజఫర్‌‌నగర్‌‌కు చేరుకోగానే చూసిన తోటి వారు ఆమె శవాన్ని ఫ్లాట్‌ఫాంపై పడుకోబెట్టారు. అయితే ఆ మహిళకు రెండేళ్ల చిన్నారి ఉన్నాడు.. తల్లి చనిపోయిందన్న విషయం ఆ చిన్నారికి తెలియక తన తల్లి  లేవడం లేదని ఆరాటపడుతున్నాడు. ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె ఎంత సేపటికీ లేవకపోవడంతో ఫ్లాట్ ఫాం మొత్తం తిరుగుతూ ఆడుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: