ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో జగన్ సర్కార్ రైతుల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్లు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు 13,500 రూపాయలు ఖాతాలో జమవుతోంది. 
 
తాజాగా జగన్ సర్కార్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో రైతుల కోసం విత్తనాల ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కేంద్రం ప్రభుత్వం అత్యాధునిక డిజిటల్ కియోస్క్ లను ఏర్పాటు చేయనుంది. 
 
రైతులకు తమ గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నుంచి మార్కెటింగ్ వరకు ఏటీఎంల మాదిరిగా ఈ కియోస్క్ లు పని చేయబోతున్నాయి. రైతుల కోసం అత్యాధునిక ఏటీఎం లాంటి కియోస్క్ లను రాష్ట్రంలో జగన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. డిజిటల్ కియోస్క్ లో రైతు తన ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి లాగ్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. వివిధ కంపెనీలకు చెందిన ఎరువులు, పురుగు మందులు, పంటల దాణా, వాటి ధరలు కియోస్క్ స్క్రీన్ పై కనిపిస్తాయి. 
 
రైతు ఏవి కావాలో, ఎంత పరిమాణంలో కావాలో ఎంపిక చేసుకోవచ్చు. రైతు ఆర్డర్ చేసిన 48 గంటల నుంచి 72 గంటల్లో రైతులు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు అందుతాయి. విత్తనాలు ఆంధ్రప్రదేశ్ సీడ్స్ సంస్థ, అగ్రోస్ సీడ్స్ సంస్థ ఉత్పత్తి చేయనుందని తెలుస్తోంది. మొదట్లో రైతులు కొంత ఇబ్బందులు పడినప్పటికీ క్రమంగా వీటిపై రైతులకు అవగాహన పెరగనుంది. రైతుల కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: