ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా దేశం అతలా కుతలం అవుతుంటే మరో వైపు మిడతల దండు ఆందోళన కలిగిస్తోంది. పంట పొలాలపై దాడి చేస్తున్న మిడతలు ధాన్యాన్ని పంటను నాశనం చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. ఇక ఇప్పుడు మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని  రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది.  ఈ రాకాసి మిడతలు ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పంటకు నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో.. మిడతల దండు తెలంగాణ వైపు వస్తోంది. మహారాష్ట్ర మీదుగా తెలుగు నేలవైపు లక్షలాది మిడతలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ మిడతల దండు రాష్ట్ర సరిహద్దుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలంగాణ అధికారులు తెలిపారు. ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించేది లేనిది మరో రెండు రోజుల్లో తెలుస్తుందన్నారు.   

 

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇక మిడతలన చంపేందుకు పిచికారీ చేస్తున్నారు.   ఇక మిడతల వల్ల జనాలు బయపడిపోతుంటే.. డోంట్ వర్రీ.. వాటికి చంపడం కంటే తినడమే మంచిదని ఆస్ట్రేలియాకి చెందిన పరిశోధకులు చెప్తున్నారు.

 

అవి చాలా ప్రోటీన్ ఫుడ్ అని.. వాటిని తింటే చాలా వరకు ప్రోటీన్ లు మనిషికి లభిస్తాయని అంటున్నారు. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు వీటిని ఆహారంగా తీసుకుంటారని అంటున్నారు. దక్షిణ అమెరికా దేశాలు మిడతల దండులను ఎదుర్కోవడానికి వాటిని తింటారని తెలిపారు.  అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దని అంటున్నా భారతీయులు.  మిడతల బారినుంచి తప్పించుకోవడానికి చాలా మంది పురుగుల మందులను పిచికారి చేస్తున్నారు. కొన్ని చోట్ల డప్పులు మోగించడం, పాటలు పెద్ద సౌండ్ తో పెట్టడం, హైడ్రోజన్ బాంబులను(సుతీల్ బాంబు) పేల్చడం వంటివి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: