తెలంగాణ బిజెపిని పరుగులు పెట్టించాలని కొత్త అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్ అంటే ప్రజలకు మొహం మొత్తిందని, ఇక కాంగ్రెస్ పని అంతంతమాత్రంగానే ఉంది కాబట్టి తమకు తిరిగే లేదన్నట్లుగా తెలంగాణ బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్లాలని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీనికోసం జూన్ మొత్తం ఒకే అంశంపై ఉద్యమాలు నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాల్లో లోపాలను, ప్రభుత్వ తప్పిదలను ఎండ కట్టడమే కాకుండా, వాటి గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు సిద్ధమవుతున్నారు. 

 

IHG

ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సమగ్ర వ్యవసాయ విధానంపై బిజెపి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. జూన్ నెల మొత్తం రైతుల సమస్యల పైన తమ పార్టీ తరఫున పోరాడాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు కోర్ కమిటీలో ఈ విషయంపై పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. వచ్చేనెలలో చేసే ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ కీలక నేతల అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్లాలని కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. 

 

అలాగే సమగ్ర వ్యవసాయ విధానంలో ఉన్న ఇబ్బందులు, లోటుపాట్లను రైతులకు వివరించి కరపత్రాలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతు సదస్సులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయ్యి జూన్ నెల కార్యక్రమాలకు సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ మద్దతు కోరిన బండి సంజయ్ వరుసగా ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ బిజెపికి మైలేజ్ పెంచేవిధంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: