ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా వైసిపి అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంపై తాడేపల్లి క్యాంపు ఆఫీసు లో నిర్వహించిన మన పాలన-మీ సూచన సదస్సులో ఇంగ్లీష్ మీడియం విద్య, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న గోరుముద్ద తదితర అంశాలపై మాట్లాడారు. అయితే ఈ సందర్భం లోనే ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఓ చిన్నారి జగనన్న గోరుముద్ద పథకం పై ముద్దు ముద్దు మాటలతో జగన్ మోహన్ రెడ్డి ని నవ్వించి ప్రస్తుతం వార్తల్లో, సోషల్ మాధ్యమాలలో నిలుస్తోంది.


ఆ చిన్నారి మాట్లాడుతూ... ' గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ మామయ్యకు నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను 5వ తరగతి చదువుతున్నాను. జగనన్న గోరుముద్ద గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే... ఇది వరకు ఒకటి, రెండు కూరలు మాత్రమే పెట్టేవారు. ఇప్పుడైతే ఎన్నో రకాల కూరలను పెడుతున్నారు. వారానికి 5 గుడ్లు. స్వీటు పొంగలి, పాయసం, పులిహోర, ఎగ్ కర్రీ, కుర్మా, సాంబార్... ఇంకా ఎన్నో పెడుతున్నారు. మేమంతా చాలా ఇష్టంగా తింటున్నాం. జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ లో మా అన్నయ్య 8వ తరగతి చదువుతున్నాడు. మా అన్నయ్య కూడా స్కూల్లోనే తింటున్నాడు. జగనన్న గోరుముద్ద వలన మేము ఎంతో ఇష్టంగా తింటున్నాం. అలాగే ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాం కూడా. ఇవన్నీ మాకు పెట్టేస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను', అని ఈ చిన్నారి ముద్దు ముద్దు మాటలతో చెప్పగా... జగన్మోహన్ రెడ్డి ఫిదా అయిపోయి ముసి ముసి నవ్వులు నవ్వుతూ థాంక్యూ చిట్టి తల్లి అని అన్నారు.


ఇంకొక ఆసక్తికరమైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. ఒక యువతి జగన్మోహన్ రెడ్డి ని తెగ పొగిడేసింది. మిమ్మల్ని చూసిన తర్వాత మీ పాలనలో నేను కూడా పాలు పంచుకోవాలని ఉంది, సార్. మీరు అవకాశం ఇస్తే మీ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తాను. మీరు బాగా సపోర్ట్ ఇస్తారు. మీరు కంటిన్యూస్గా నవ్వుతుంటారు. మీ నవ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పాజిటివ్ ఎనర్జీ ని వ్యాప్తి చేస్తుంది. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని మీరు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు', అని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: