కొత్తగా పెళ్లి అయ్యి ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన కోడలికి ఓ ఊహించని సంఘటన ఎదురైంది. తన కొడుకు భార్యని కన్న కూతురిలా భావించాల్సిన మామ అ కోడలిపై కామంతో చెలరేగిపోయాడు. పెళ్లయిన కొద్ది రోజులకి అతని కోడలి పై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అసభ్యకరంగా మాట్లాడుతూ, డబల్ మీనింగ్ డైలాగులు చెబుతూ, ఆ అమ్మాయిని తాకుతూ అనేక ఇబ్బందులకు గురి చేసేవాడు ఆ కీచక మామ. ఇక ఈ విషయాన్ని అత్త కి చెబితే ఆమె నోరు మూసుకో అనింది. చివరకు తన బాధని కట్టుకున్న భర్త కి చెబితే అతడు కూడా నమ్మలేదు. చివరకు ఆధారాలతో సహా అతని మామను పట్టించింది. ఇక ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని పండ్రవాడ ప్రాంతంలో జరిగింది.


5 నెలల క్రితం ఓ యువకుడికి, యువతికి డిసెంబర్ 19న వివాహం జరిగింది. పెళ్లై అత్తవారింట్లో అడుగు పెట్టిన కొద్ది రోజులకే ఆమెకు అనుకోకుండా తన మామ తరపునుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మామా తన కోడలిపై అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని తన అత్త, మొగుడితో చెప్పిన వారు నమ్మలేదు. అయితే వారిని ఎలాగైనా నమ్మించాలన్నా సమయంలో ... ఇంట్లో కోడలు ఒంటరిగా ఉన్న సమయంలో మామ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సంఘటన నుంచి ఎలాగోలాగా తప్పించుకున్న కోడలు విషయాన్ని భర్తకు తెలియజేసింది. ఇకపోతే ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేసింది. అలా చెప్పిన భార్య కు షాక్ అవ్వడం తన వంతు అయింది. ఎందుకు అంటే ఇలా గనక మరోసారి జరిగితే తన ఫోన్ లో వీడియో తీయాలని అతను తెలిపాడు..  


అయితే ఇవన్నీ ఏమీ తెలియని మామ కామంతో రెచ్చిపోయి కొడుకు ఇంట్లో లేని సమయంలో మరోసారి కోడలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే భర్త సూచనల మేరకు మామ బాగోతాన్ని వీడియో తీసిన కోడలు భర్తకు చూపించడంతో పాటు ఆమె తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. దీనితో అత్యాచారం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా సదరు నిందితుడు ఇంట్లో నుంచి మాయమయ్యాడు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: