కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా బార్డర్ లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మృత దేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభించింది. ఈ మృతదేహం చర్లో తండా  సమీపంలో పూర్తిగా కాలిపోయి కేవలం ఎముకలు గూడుకట్టిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కొందరు పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా అతని శరీరాన్ని కట్టెలతో కాల్చినట్లుగా గుర్తులు, అక్కడే పడి ఉన్న పెట్రోల్ డబ్బా పోలీసులకు కంట పడ్డాయి. 

IHG


అయితే ఆ మృతుడు కోలుకుల గ్రామానికి చెందిన వెంకటయ్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వెంకటయ్య గత నెల రోజుల క్రితం అదృశ్యం అయ్యాడని వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో అప్పుడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని ఎంత వెతికినా అతని ఆచూకీ మాత్రం లభించలేదు. దీనితో ఇప్పుడు లభించిన మృతదేహం వెంకటయ్య అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే అక్కడ శవం పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్ళు పోలీసులు వారి దర్యాప్తులో పేర్కొన్నారు.


ఇకపోతే ఈ విషయంలో వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. దీనితో మిస్సింగ్ కేసును పోలీసులు హత్యకేసు గా మార్చేశారు. ఇకపోతే చివరకు ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహిస్తేనే అది వెంకటయ్య .... కాదా ...? అని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. నిజానికి నల్లమల్ల అడవుల్లో కనీసం వారానికి రెండు మూడు ఇలా సంభవిస్తూనే ఉంటాయి. ఎవరో ఎక్కడో హత్యచేసి, లేకపోతే ఏదైనా దాడి చేసి నల్లమల్ల అడవుల్లోకి వారి శవాలను తీసుకువచ్చి పడేసి వెళ్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: