ప్రస్తుతం దేశం మొత్తం కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది.  అయితే కరోనా వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే.  రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయ.. దాంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రైతులు, వ్యాపారులు, చిరు ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  మొన్నటి వరకు రవాణా వ్యవస్థ స్థంభించిపోవడంతో రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు ఎప్పటికప్పుడు భరోసా ఇస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు.  తాజాగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

 

అందుకోసం వానకాలంలో రైతులు లాభసాటి పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని చెప్పారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కావడం రైతుల అదృష్టమని పేర్కొన్నారు. కందుకూరు మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాచులూరు, గుమ్మడవెల్లి, మీర్‌ఖాన్‌పేట్‌ గ్రామాల్లో వానకాలంలో రైతుల సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు.  ఒకే పంటను రైతులు సాగుచేయడం వల్ల ధరలు తగ్గి తీవ్రంగా నష్టపోతారన్నారు.  మొదటి నుంచి రైతు సంక్షేమం గురించి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ ఏ ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందన్న విషయం చెబుతూనే ఉన్నారు. అంతే కాదు రైతు బంధు విషయంలోకూడా ఆయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని రైతులకు భరోసా ఇస్తున్న విషయం తెలిసిందే.

 

ఎం కేసీఆర్‌ లాభసాటి పంటలపై దృష్టి పెట్టి వ్యవసాయంలోమార్పు తీసుకవస్తున్నారని తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానం అమలు చేయడం వల్ల లాభాలు వస్తాయని ,వానాకాలంలో పత్తి, కంది పంటలతో పాటు ఉద్యాన పంటలు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో లక్షల ఎకరాలు సస్యశ్యామయ్యావని, త్వరలో పాలమూరు, రంగారెడ్డి సాగునీటి పథకం ప్రారంభమతున్నట్లు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: