ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి మరో మారు శ్రీకాకుళం జిల్లాకే దక్కబోతోందా అంటే సమాధానం అవుతును అని వస్తోంది. ఇంతకాలం ఈ పదవిలో ఇదే జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. ఆయన స్థానంలో అచ్చెన్నకు బాధ్యతలు అప్పగించాలని బాబు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

 

అచ్చెన్న ఇప్పటికే చంద్రబాబుకు అసెంబ్లీలో ఉప నేతగా చేఒదోడు వాదోడుగా ఉంటున్నారు. ఏ సమస్య మీద అయినా బాబు మాటను బట్టి అల్లుకునిపోవడం, పరిష్కరించడం అచ్చెన్న చేస్తూ అధినాయకత్వం మెప్పు పొందారు. అందుకే అచ్చెన్నకే ఆ పదవి కట్టబెట్టాలని బాబు డిసైడ్ అయ్యారట.

 

నిజానికి ఈ పదవి విషయంలో అనంతపురానికి చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరుని మొదట బాబు అనుకున్నారుట. అయితే జగన్ సర్కార్ మీద దూకుడుగా సాగాలి, పోరాటం చేయాలి అంటే అచ్చెన్న బెటర్ అని బాబు తరువాత నిర్ణయించుకున్నారని, దాంతో చివరి నిముషంలో మార్పు చేసుకున్నారని అంటున్నారు.

 

ఇదిలా ఉండగా ఇప్పటిదాకా కింజరాపు కుటుంబం బాబుకు దన్నుగా ఉంటూ వస్తోంది. అలాగే ఓటమి ఎరుగని నేతగా అచ్చెన్న ఉన్నారు. ఆయనతో పాటు ఎర్రన్నాయుడు కొడుకు ఎంపీగా ఉంటే, కుమార్తె  భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా పార్టీకి పెద్ద దన్నుగా ఉంటూ వస్తున్న అచ్చెన్నను ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ముందు పెట్టి జగన్ తో పోరాటం చేయాలని బాబు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.

 


ఏపీలో చూసుకుంటే తమ్ముళ్ళు అంతా పార్టీ ఓడిపోయాక ఒక్కసారిగా డల్ అయిపోయారు. ఎక్కడా సౌండ్ లేదు. దానికి తోడు టీడీపీకి ఉత్తరాంధ్ర ఈసారి పెద్ద దెబ్బేసింది. ఈ పరిణామాలను చూసిన బాబు బీసీ నేత అయిన అచ్చెన్నను కొత్త సారధిని చేస్తే అన్ని విధాలుగా ఉపయోగంగా ఉంటుందని లెక్కలు వేసారని అంటున్నారు. తొందరలోనే అచ్చెన్న నియామకం ఖాయమని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: