జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో బేటీ అవ్వటం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. తెలంగాణ రాజకీయాలలో పవన్ ఇక పూర్తి స్థాయిలో ఎంటర్ అవబోతున్నారా అనే చర్చలు రెండు రాష్ట్రలో జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ జర్నీ గమనిస్తే ఎక్కువగా ఆయన పొలిటికల్ లీడర్ గా కనబడింది ఆంధ్రాలోనే. 2014లో జనసేన పార్టీని స్థాపించిన టైములో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తప్ప పెద్దగా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో తల దూర్చిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. ఎక్కువగా ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ మూడో అతి పెద్ద పార్టీగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని ఆవిష్కరించారు.

 

2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇటీవల బిజెపి పార్టీ తో కలిసి పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకొని పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో బేటీ అవ్వటం పట్ల తెలుగు రాజకీయాల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వల్ల పార్టీ కి సినీ గ్లామర్ వచ్చే అవకాశం ఉండటంతో ఆ చరిష్మా తో బీజేపీ సరికొత్త ఎత్తు గడలు వేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పై తాము ఎంత పోరాటం చేసిన గాని సరైన స్పందన ప్రజల నుండి రాకపోవటంతో బండి సంజయ్ సినీ చరిష్మా కలిగిన నాయకుడు పైగా బీజేపీకి మిత్రుడు గా ఉంటున్నా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ చేస్తే అధికార పార్టీ పై సక్సెస్ సాధించవచ్చని డిసైడ్ అయి ఆయనతో భేటీ అయ్యారు అంట. కేసిఆర్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఢీ కొనాలంటే కచ్చితంగా పవన్ చరిష్మా తెలంగాణ బిజెపికి చాలా అవసరమని పవన్ తో ఈ విషయం గురించి బండి సంజయ్ మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు నీటి ప్రాజెక్టు సమస్య ఓ కొలిక్కి వచ్చాక కచ్చితంగా కలిసి పని చేస్తానని పవన్ అన్నట్లు వినికిడి.

 

పోతిరెడ్డిపాడు సమస్య తప్ప మిగతా విషయాల్లో కలిసి పని చేస్తానని పవన్…. సంజయ్ కి హామీ ఇచ్చారట. తెలంగాణ రాజకీయాల గురించి బీజేపీ ఢిల్లీ పెద్దలు కూడా ఇటీవల పవన్ తో ఫోనులో చర్చించినట్లు..... తెలంగాణలో పార్టీకి కొంత ఊపు వస్తే ఆంధ్ర లో ‘బిజెపి - జనసేన’ కూటమి కి అధ్యక్ష పదవి ఇస్తామని లాజిక్ ఆఫర్ పవన్ కి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ పదవి పోయే వార్తలు ఎక్కువగానే ఏపీలో వినబడుతున్నాయి. ఇటువంటి సమయంలో పవన్ కి ఢిల్లీ బీజేపీ పెద్దలు అధ్యక్ష పదవి ఆఫర్ ఇస్తున్నట్లు వార్తలు రావటంతో ఏపీ రాజకీయాల్లో కూడా పవన్ - బండి సంజయ్ బేటీ పెద్ద హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: