గత కొన్ని రోజులుగా శ్రీవారి భూములకు సంబంధించి పెద్ద రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో ఉన్న శ్రీవారి భూములని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించుకోవడం, ఇక ఆ నిర్ణయంపై అన్నీ వైపుల నుంచి విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం భూముల వేలానికి బ్రేక్ వేసింది. అయితే గత టీడీపీ ప్రభుత్వంలోనే శ్రీవారి భూముల అమ్మకానికి సిద్ధమయ్యారని, అదే అంశాన్ని తాము పరిశీలించామని వైసీపీ వాళ్ళు చెప్పారు. కానీ గతంలో తాము అలాంటి కార్యక్రమం చేయలేదని, ఇది కేవలం వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారమని టీడీపీ వాళ్ళు ఫైర్ అయ్యారు.

 

అయితే కొన్ని రోజులు టీటీడీ భూములపై రగడ జరిగినా, ప్రభుత్వం కల్పించుకుని దానికి బ్రేక్ వేయడంతో సమస్య సద్దుమణిగింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దీన్ని వదిలేలా లేరు. మహానాడు కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా చేసి, మధ్యలో శ్రీవారి భూముల విషయాన్ని లేపి, వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ధన దాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచమని మాట్లాడారు.

 

ఇక ఇక్కడ బాబు లాజిక్ లేని విమర్శ చేసినట్లే కనిపిస్తోంది, ఎందుకంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు టీటీడీ బోర్డు అమలు చేయడానికి చూసింది. కానీ ఇది హిందువుల మనోభావాలతో లింక్ పడి ఉండటంతో జగన్ ప్రభుత్వం, వేలం ప్రక్రియని ఆపేసింది. ఇక్కడే ఇంకో అంశం చెప్పుకోవాలి. పైగా ఎలాంటి అవినీతి జరగకుండా వేలం బహిరంగంగా వేయడానికే టీటీడీ బోర్డు సిద్ధమైంది తప్ప, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన మాదిరిగా ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేయట్లేదు.

 

సరే బాబు లాజిక్ లేని విమర్స చేయడమే కాకుండా, ఓ కామెడీ కూడా డైలాగ్ వేశారు. తాము ఏనాడు అధికార దుర్వినియోగం చేయలేదని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది టీడీపీ నేతలు అధికార దుర్వినియోగం చేశారో ప్రజలకు బాగా తెలుసు. అందుకే బాబుని పక్కనబెట్టి జనం జగన్‌ని గెలిపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: