తెలంగాణలో మరో  నాలుగు రోజుల్లో లాక్ డౌన్ గడువు ముగియనుంది . లాక్ డౌన్ గడువు ముగిసిన వెంటనే తిరిగి మళ్లీ లాక్ డౌన్ పొడగిస్తారా?, లేకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న  ఆంక్షలను కూడా  తొలగిస్తారా ?? అన్నది హాట్ టాఫిక్ గా మారింది . ప్రస్తుతానికి లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ , రాష్ట్రం లో  దాదాపుగా కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది . రాత్రిపూట ప్రస్తుతానికి కర్ఫ్యూ అమలులో ఉండడం , సాయంత్రం ఆరు గంటల వరకు వ్యాపార , వాణిజ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తోంది . . కంటైన్ మెంట్ జోన్ లో ఎటువంటి కార్యక్రమాలకు అనుమతించడం లేదు .

 

అయితే  రాష్ర్త ప్రభుత్వం ఇటీవల లాక్ డౌన్  ఆంక్షలను ఎత్తివేసిన తరువాత రాష్ట్రం లో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రతీ ఒక్కర్ని ఆందోళనకు గురి చేస్తోంది . ఈ నేపధ్యం లో లాక్ డౌన్ గడువు పొడగిస్తారా ? , ఒకవేళ పొడిగిస్తే ఎటువంటి ఆంక్షలు అమలు చేస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది . కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యం లో , లాక్ డౌన్ పొడగింపుకు రాష్ర్త ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను మరింత సడలించే అవకాశం ఉన్నట్లు సమాచారం . రాష్ర్త వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడుపున్నప్పటికీ , హైదరాబాద్ నగరం లో ఆర్టీసీ సిటీ బస్సులను తిప్పడం లేదు . మెట్రో కూడా నడవడం లేదు .

 

దీనితో ప్రజారవాణా వ్యవస్థ అందుబాటు లో లేక రోజువారీగా ప్రైవేట్ , ప్రభుత్వ కార్యాలయాల కు  విధులకు హాజరయ్యే వారికి ఇబ్బందులు తప్పడం లేదు . ఒకవేళ ఈసారి లాక్ డౌన్ గడువు పొడగించినా , ప్రజా రవాణా వ్యవస్థ ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం లేకపోలేదని  అంటున్నారు . అదే జరిగితే రాష్ట్రం లో  కరోనా మరింత విజృంభించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . చూడాలిమరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ?. 

మరింత సమాచారం తెలుసుకోండి: