ప్రపంచంలో కరోనా వైరస్ ఎంత ఘోరంగా ప్రబలి పోతుందో అందరికీ తెలిసిందే.  మొదట కరోనా వైరస్ విదేశీయుల ద్వారా వ్యాపించిందని అన్నారు.. ఆ తర్వాత ఢిల్లీలోని ముజాహిద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొన్న వారి వల్ల కరోనా విస్తరించిందని అంటున్నారు.  టూరిస్టులుగా వచ్చి మత కార్యక్రమం నిర్వహించినందుకుగాను మర్కజ్‌లో పాల్గొన్న 376 మంది వీదేశీయులపై డిల్లీ పోలీసులు చార్జిషీట్లు ధాఖలు చేశారు. 34 దేశాలకు చెందిన వీరిపై 35 వేర్వేరు చార్జిషీట్లు ధాఖలు చేశారు. నిభందనలకు విరుద్దంగా వీసా నిభందనలు పాటించకుండా అక్రమంగా మత సంభంద కార్యకలాపాలలో పాల్గొన్నారంటూ, దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయిన నేపధ్యంలో వీరిపై చర్యలకు పోలీసులు సిద్దమయ్యారు.  

 

కేసుల్లో 20 దేశాలకు చెందిన 82 మంది విదేశీయులపై  మంగళవారం 20 చార్జిషీట్లు, 14 దేశాలకు చెందిన 294 మంది విదేశీయులపై బుదవారం మరో 15 చార్జిసీట్లు ధాఖలు చేశారు పోలీసులు. వీరిపై వీసా నిభందనలు ఉల్లంఘించినట్లు, అంటు వ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వాహణ చట్టం, సెక్షన్‌ 144 ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు.  ఢిల్లీ నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లడం తగ్లిబన్ల ద్వారా వైరస్ మరింత మందికి సోకిందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకునేందుక సిద్దమయ్యారు ప్రభుత్వాలు.  ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు స్వయంగా క్వారంటైన్ లోకి వెళ్లాలలని.. లేదా ఆసుపత్రికి రావాలని డాక్టర్లు కోరారు. 

 

294 మంది విదేశీయులపై బుదవారం మరో 15 చార్జిసీట్లు ధాఖలు చేశారు పోలీసులు. వీరిపై వీసా నిభందనలు ఉల్లంఘించినట్లు, అంటు వ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వాహణ చట్టం, సెక్షన్‌ 144 ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటు విదేశీయులు ఉల్లంఘనలు చేసినపుడు వారిపై చర్యలు తీసుకునేందుకు సంభందించిన చట్టాలలోని భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 188, 269, 270, 271ల కింద కేసులు నమోదు చేశారు. మరో 900 మంది విదేశీయులపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు డిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: