రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది . మే మాసం లో పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కోరినప్పటికీ , ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమిరా అన్నారు . మే మాసం లోను ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్నట్లు ఆయన  ప్రకటించారు . కరోనా వైరస్ వ్యాప్తి ని అడ్డుకోవడానికి మార్చి నెలాఖరు లో   లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే .   రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజాపతినిధులు ,  ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించారు .

 

అయితే కొన్ని విభాగాల ఉద్యోగులకు మాత్రం పూర్తిస్థాయి లో వేతనాలు అందజేయడమే కాకుండా , వైద్య, పారిశుధ్య , పోలీసు  విభాగాలకు చెందిన వారికి నగదు  నజరానా ను కూడా అందజేశారు .    లాక్ డౌన్ ఆంక్షలు ఇటీవల సడలించడంతో , రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉన్నదని , ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని ఉద్యోగ , ఉపాధ్యాయ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు  . అయితే ఉద్యోగుల విన్నపాన్ని కేసీఆర్ సర్కార్ ఏమాత్రం పరిగణలోకి తీసుకున్నట్లు కన్పించడం లేదు .

 

అందుకే మే మాసం వేతనాల్లోనూ యధావిధిగా కోతలు కొనసాగుతాయని  ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం లో కేసీఆర్ ప్రకటించినట్లు తెలుస్తోంది . పొరుగు సేవ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించాలని ఆదేశించినట్లు సమాచారం . ఇక మే మాసానికి కూడా రేషన్ కార్డు కలిగిన వారికి ఉచిత బియ్యం పంపిణి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ , నగదు పంపిణీ ని నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది . ఆసరా పింఛన్లు యధావిధిగా లబ్ధిదారులకు అందజేయాలని కేసీఆర్ సూచించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: