తెలుగు రాజకీయ నాయకుల లో ఎక్కువగా మీడియా ఆర్భాటాలకు పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు చంద్రబాబు అని చాలామంది అంటారు. ప్రత్యర్థులు కూడా చంద్రబాబు చెప్పేది ఎక్కువ చేసేది తక్కువ అంటూ చాలా సార్లు సెటైర్లు వేయడం మనం చూశాం. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం 'మహానాడు' మే 27 వ తారీఖున చంద్రబాబు స్టార్ట్ చేయడం జరిగింది. జూమ్ యాప్ ద్వారా డిజిటల్ మహానాడు గా నామకరణం చేసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది టిడిపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అయితే చాలా వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తలకు టెక్నాలజీ గురించి సరైన అవగాహన లేకపోవడంతో 'డిజిటల్ మహానాడు' పై విమర్శలు వస్తున్నాయి.

 

టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ‘మహానాడు’ కార్యక్రమం ఇటువంటి కరోనా కష్టకాలంలో చేపట్టడం పార్టీకే లాస్ అని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో రికార్డుల కోసం ఆరాటం తప్ప రెండు నెలలు ఆగితే సరిపోద్ది కదా అని సెటైర్లు వేస్తున్నారు. మరొకపక్క చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు పార్టీ ఓడిపోయాక ఇటువంటి కార్యక్రమంతో పార్టీని బూస్టింగ్ ఇచ్చే అవకాశాన్ని చంద్రబాబు కోల్పోయారని అంటున్నారు. మరోపక్క మొదటి రోజు జరిగిన ‘మహానాడు’ కార్యక్రమంలో వేలాది మంది తెలుగుదేశం పార్టీకి చెందిన యువకులు జూమ్ యాప్ ద్వారా పాల్గొనటం జరిగింది.

 

మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి లైవ్ ఇవ్వటంతో చాలామంది టిడిపి పార్టీ నాయకులు కార్యాలయానికి చేరుకొని పాల్గొనడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటిరోజు జరిగిన మహానాడు లో వైసీపీ పార్టీ అధికారంలో టీటీడీ ఆస్తుల విక్రయాలు గురించి తీసుకున్న నిర్ణయంపై ఇంకా అనేక పొరపాట్లు గురించి టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంకా అనేక విషయాల గురించి జగన్ సర్కార్ పొరపాట్ల పై టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు సంతాపం వ్యక్తం చేశారు. మొత్తం మీద టిడిపి పార్టీ తరఫున ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే 'మహానాడు' కార్యక్రమం కరోన కష్టకాలంలో నిర్వహించడం పై సొంత పార్టీ కార్యకర్తల నుండే విమర్శలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: