సాధారణంగా వామపక్షాలతో కలిసి రాజకీయం చేయడం అనేది చాలా కష్టం సిపిఐ సిపిఎం తో రాజకీయం చేయడం అనేది కత్తి మీద సాములాంటిది అనేది వాస్తవం. వారి సిద్దాంతాలను అర్ధం చేసుకోవాలి వారి డిమాండ్ లకు అంగీకరించాలి అదే విధంగా వారు తీసుకు రావాలి అనుకునే సంస్కరణలకు కూడా సిద్దంగా ఉండాలి. అదే విధంగా వారిని సంతృప్తి పరచడానికి అవసరం అయితే కొన్ని కొన్ని త్యాగాలు కూడా ఎంత బలమైన రాజకీయ పార్టీ అయినా చెయ్యాల్సి ఉంటుంది. అయినా సరే ఎన్టీఆర్ ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పడకుండా వారు ఇబ్బంది పడకుండా రాజకీయం చేసారు. 

 

వామపక్షాలను ఆయన దగ్గర చేసుకున్న విధానం గాని వారిని ఆదరించిన విధానం గాని ఎన్నో ఆదర్శంగా ఉంటాయి. మావోయిస్ట్ లు కూడా దేశ భక్తులే బ్రదర్ అన్న మాట కు ఎన్టీఆర్ ని మావోలు కూడా విమర్శించలేదు. ఇక ఎన్టీఆర్ ఆ విధంగా వారిని ఆదరించడమే కాదు తన ప్రభుత్వ ఉద్దేశం కమ్యునిస్ట్ ఉద్దేశాల కు దగ్గరగా ఉంటుందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ని వామపక్షాలు ఆదరించడానికి అదే ప్రధాన కారణం అని అంటూ ఉంటారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వారిని ఆదరించారు. 

 

రాజకీయాల్లో మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తగ్గడం ఎన్టీఆర్ కి ఏ సందర్భంలో కూడా నచ్చేది కాదు అని అంటారు. ఆ విధంగా ఎన్టీఆర్ రాజకీయం చేసారు. ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలు ఆయనను ఆదర్శంగా తీసుకుని చేసినా చాలా బాగుంటాయి అని చాలా మంది అంటూ ఉంటారు. రాజకీయాలు చేయడం అంటే ఆవేశం కాదు ఆలోచన ఉండాలి. కాని ఎన్టీఆర్ రాజకీయంలో ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే ఆయన సమర్ధవంతంగా రాజకీయం చేసారు. ఎవరికి భయపడకుండానే రాజకీయం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: