రాయలసీమ ప్రాంత ప్రజలు ముందునుండి వైసిపి పార్టీని ఆదరిస్తూనే వున్నారు. 2014, 2019 ఎన్నికల ఫలితాలు బట్టి గమనించి చూస్తే అర్ధమవుతోంది. కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చేసిన మేలు అని చెప్పవచ్చు. దీంతో అప్పటి నుండి రాయలసీమ ప్రాంత వాసులు వైఎస్ కుమారుడు జగన్ ని ఆదరిస్తూనే వున్నారు. అటువంటిది ప్రస్తుతం జగన్ అధికారంలోకి రావడంతో రాయలసీమ ప్రాంతం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి అర్థమవుతోంది. పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తూ రాయలసీమ ప్రాంతం అంటే గుర్తొచ్చే కరువుని పారద్రోలటానికి సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడం మనం చూస్తున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో సీమ వాసులు ముందునుండి ప్రభుత్వాలపై మండి పడుతూనే ఉన్నారు.

 

ఇటువంటి సమయంలో జగన్ రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ నిర్లక్ష్యంగా కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ అదే విధంగా నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను నింపడం ద్వారా ఆయా ప్రాంతాలలో సస్యశ్యామలం చేసేందుకు పక్కా ప్లాన్ ఇప్పటికే రెడీ చేయడం జరిగింది. 33 వేల కోట్లకు పైగానే నిధులు రాయలసీమ ప్రాజెక్ట్స్  కి కేటాయించి పనులు చేపట్టాలని ఇప్పటికే సరికొత్త ప్లానింగ్ జగన్ వేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్.

 

ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టుల్లో 800 అడుగులు ఉంటే వాటిని వాడుకోవటానికి పోతిరెడ్డి ప్రాజెక్టును సామర్థ్యం పెంచడానికి ఇటీవల జగన్ నిర్ణయం తీసుకోవడం మనకందరికీ తెలిసిందే. ఈ నిర్ణయంతో నీళ్లు లేని పరిస్థితిలో కూడా రాయలసీమలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల నీరు అందించే అవకాశం ఉంటోంది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా జగన్ భారీ ఎత్తున నిధులు కేటాయించడంతో సీమ జిల్లాలలో భవిష్యత్తులో ఎప్పటికీ ఇంక జగన్ కి ఎదురు లేనట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: