ఎన్టీయార్.. ఈ మూడు అక్షరాలు చాలు పాజిటివ్ వైబ్రేషన్స్ కి సంకేతాలు. ఆయన సినీ, రాజకీయ జీవితం రెండూ సూపర్ డూపర్ సక్సెస్. ఎంటీయార్ జన నాయకుడు, వెండితెర వేలుపు. అటు కధానాయకునిగా, ఇటు ప్రజానాయకునిగా రాణించిన అరుదైన నేత అన్న గారు.

 

ఎన్టీయార్ పేరు తలచుకుంటేనే ప్రతి తెలుగువాడి మనసు పులకరిస్తుంది. ఎన్టీయార్ మన వాడు అని గర్వంతో గుండె ఉప్పొంగుతుంది.  ఎన్టీయార్ కి సాటి పోటీ ఎవరూ లేరు, ఇక రారు కూడా. ఆయనది జనం భాష.  జనాల  నాడి పట్టుకున్న ప్రజా వైద్యుడు. 

 

ఎన్టీయార్  రాజకీయ జీవితంలో అన్నీ  గెలుపులే, ఓటములు కూడా ఆయన్ని చూసి సౌండ్ చేయడం మానేశాయి. ఎన్టీయార్ ఆంధ్రాలో దెబ్బ కొడితే ఢిల్లీలో రీసౌండ్ గా వినిపించేది. ఆయన చుట్టూ జాతీయ నాయకత్వం అంతా తిరిగేది.

 

కాకలు తీరిన నాయకులు ఎన్టీయార్ తోనే దేశంలో సంచలనాలు  నమోదు అవుతాయని భావించేవారు. ఎన్టీయార్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కేంద్రంలో కాంగ్రేసేతర ప్రభుత్వానికి నాంది పలికారు. పన్నెండేళ్ల   తరువాత మరో జయప్రకాష్ నారాయణ్ లా ఎన్టీయార్ జాతీయ రాజకీయాన్ని నడిపించారు.

 

ఇక ఎన్టీయార్ జీవితంలో రెండుసార్లు వెన్నుపోట్లు ఎదుర్కొన్నారు. తొలి వెన్నుపోటుని విజయవంతంగా  నిలిచి గెలిచారు. రెండవసారి మాత్రం ఎన్టీయార్ ఓడిపోలేదు. ఆయన ఆయుష్షు కొంచం ఉంటే మళ్ళీ గెలిచేవాడే. అందుకే అభిమానులు అంతా చెప్పుకుంటారు ఎన్టీయార్ వెన్ను గట్టిది. వెన్నుపోట్లు కానీ ఎదురుపోట్లు కానీ ఏమీ చేయలేని వజ్రసముడు ఎన్టీయార్ అని. అదే నిజం కూడా.

 

 ఆ దేవుడు దయ చూపించి ఎన్టీయార్ కి మరింతగా ఆయుష్షు ఇచ్చి ఉంటే కనుక 1996 నాటికి ఆయన బంపర్ మెజారిటీతో మళ్ళీ గెలిచి ఏపీలో నాటి వెన్నుపోటు ప్రభుత్వాన్ని కూలదోయడమే కాదు, దేశానికే ప్రధాని అయ్యేవారు. కానీ దేవుడు ఆయన్ని తీసుకుపోయాడు. అంతే తప్ప ఎన్టీయార్ ఎవరి చేతుల్లోనూ  ఎప్పటికీ ఓడలేదు. ఆయన ఎప్పటికీ విజేతే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: