ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పని చేసినన్ని రోజులు కూడా చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా చూస్తూ ఉండేవి అని చాలా మంది ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను చూసిన  తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యమత్రులు ఆయన స్ఫూర్తి తో ఎన్నో నిర్ణయాలను తీసుకునే వారు అని మహిళల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు వారికి ఇప్పటికి కూడా ఆదర్శంగా నిలిచాయని అంటారు. ఆయనను చూసి ప్రధానులు కూడా చాలా నేర్చుకున్నారు అని అంటూ ఉంటారు. 

 

ఎన్టీఆర్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఆ విషయం గురించి అందరికి తెలిసిందే. ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడు కి చేసిన సేవ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయన ఆ రాష్ట్రానికి సాగునీరు అందించడంలో చాలా కీలకంగా వ్యవహరించారు అని అంటారు. ఆయన తన రాజకీయంలో రాష్ట్రానికి ఫలితం ఉండే విధంగానే తమిళనాడు కి తెలుగు గంగ ద్వారా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని అప్పుడు దానికి తమిళనాడు కూడా పేరు పెట్టాలని చూసినా సరే తాను పెట్టిన పేరే ఉండాలి అని ఎన్టీఆర్ చెప్పారట. 

 

అయినా సరే తమిళనాడు ఆయన మాట కాదు అనలేక ఆ పేరునే కొనసాగించింది అని... తమిళనాడు వాసులు ఇప్పటికి కూడా ఆయన అంటే ప్రత్యేకంగా అభిమానిస్తారు అని అంటారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అయితే ఎన్టీఆర్ తో ఫోటో దిగినా చాలు అని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు కూడా చేసారట. ఆ విధంగా ఎన్టీఆర్ తమిళనాడు మీద ప్రభావం చూపించారు అని అంటారు. ఎన్టీఆర్ చేసిన రాజకీయంలో తమిళనాడు ఎక్కడా ఇబ్బంది పడలేదు అని తర్వాతి ప్రభుత్వాలు వచ్చినా సరే తమిళనాడు కి నీళ్ళు ఇచ్చాయని ఇప్పటికి తమిళనాడు అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: