సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చి ఒక రేంజ్ లో సక్సెస్ అయితే చాలా మంది రాజకీయ నాయకులు కార్యకర్తలను గాని కింది స్థాయి నాయకులను గాని పట్టించుకున్న సందర్భాలు ఉండవు. అది ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విషయంలో అలా ఉండదు అని అంటారు. ఆయన ఏ స్థాయిలో ఉన్నా సరే క్షేత్ర స్థాయి నాయకులను ఎప్పుడు కూడా పట్టించుకుని వారి సమస్యలను ఆయన స్వయంగా విన్నారు అని అంటారు. ఆ విధంగా ఆయన రాజకీయాలు చేసారు అని అంటారు. 

 

ప్రతీ ఒక్కరిని కూడా ఆయన చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని వారిని ప్రత్యేకంగా ఆదరించడం ఎన్టీఆర్ నైజం అని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు అని తనను ఎవరు అయిన కలిసే అవకాశాన్ని ఎన్టీఆర్ కల్పించారు అని అంటారు. రాజకీయంలో ఆయన పార్టీ మీద చూపించిన ప్రేమ ఒక్కటే కాకుండా పార్టీ నాయకుల మీద  ప్రేమ చూపించే వారు అని ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే వారికి అన్ని విధాలుగా ఆయన అండగా నిలబడే వారు అని అంటారు. వారి నుంచి అన్ని విషయాలు తెలుసుకుని వారికి అవసరం అయితే ఆర్ధిక సహాయం కూడా చేసారు అని అంటారు. 

 

ఇప్పుడు ఉన్న చాలా మంది నాయకులు ఆయన నుంచి రాజకీయం నేర్చుకుని ఒక రేంజ్ లో నిలబడిన వారు అందరూ కూడా ఆయన చల్లని చూపు కింద వచ్చిన వారే అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ని చూసి రాజకీయ౦ నేర్చుకుని నిలబడిన వారు ఎందరో ఉన్నారు. ఇక ఆయన గురించి చాలా మంది ఇప్పటికి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటార ని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆదరించారు వారిని ఎన్టీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: