ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయినా తెలంగాణా రాజకీయాల్లో అయినా సరే తెలంగాణా సిఎం కేసీఆర్ కి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన రాజకీయం గాని ఆయన తెలంగాణా ను సాధించిన విధానం గాని అన్ని కూడా చాలా మందికి ఆదర్శం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ ని ఎప్పటికప్పుడు ఆదరిస్తూ ఉంటారని ఎన్టీఆర్ ని చూసి ఆయన ప్రత్యేకంగా కొన్ని నేర్చుకున్నారు అని అంటూ ఉంటారు. తన ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో కూడా ఆయన పెట్టుకున్నారు అని అంటారు. 

 

ఆయన మీద ఉన్న అభిమానం తోనే కొడుకు కేటిఆర్ కి ఆయన ఆ పేరు పెట్టారు అని అంటారు.  ఇక కేసీఆర్ నాయకుల వద్ద ఏదైనా సందర్భం వచ్చిన సమయంలో ఎన్టీఆర్ తో అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారని అంటారు. ఎన్టీఆర్ ని చూసి తాను చాలా నేర్చుకున్నా అని కేసీఆర్ చెప్తూ ఉంటారని అంటారు. ఇక ఎన్టీఆర్ వలనే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నారని కేసీఆర్ చాలా మంది వద్ద అన్నారని అంటారు. ఇక ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా ఎన్టీఆర్ ని చూసి ఆయన నేర్చుకున్న విధంగానే వ్యవహరిస్తూ ఉంటారని అంటారు. 

 

ఇక కేసీఆర్ కి ఎన్టీఆర్ ప్రత్యేకంగా కొన్ని లక్షణాలను నేర్పించారు అని ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని కచ్చితంగా ప్రస్తావిస్తూ ఉంటారని అంటారు. ఆ విధంగా ఎన్టీఆర్ రాజకీయాన్ని ఆయన గుర్తు పెట్టుకున్నారు అని అంటూ ఉంటారు. నేడు ఆయన ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులు చాలా మంది ఎన్టీఆర్ దగ్గర పని చేసిన వారే. ఆ విధంగా ఎన్టీఆర్ దగ్గర పని చేసిన వారికి ఆయన ఇప్పటికి కూడా ఆదరణ కల్పించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: