ఏపీలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెప్పుకోవడానికి జాతీయ పార్టీగా ఘనమైన కీర్తి ఉన్నా రాష్ట్రంలో సొంతంగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితి. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే గాని, ఒకటి రెండు సీట్లు సాధించే పరిస్థితి లేదు. అసలు కేంద్రంలో అధికారంలోకి మళ్లీ వస్తామనే నమ్మకం ఉన్నా, ఏపీలో అధిరంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేది ఆ పార్టీ నాయకులు అందరికీ తెలుసు. అయినా అధికారం సంపాదించడం కోసం అడుగులు వేస్తోంది. వైసిపి, టిడిపిని దాటుకుని ముందుకు వెళ్లేలా బిజెపి నాయకులు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. దీనిలో భాగంగానే వైసిపి, టిడిపి పార్టీలను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లాలని కమలనాథులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం, లేకపోతే వైసిపి తప్ప మూడో పార్టీకి అవకాశమే లేదన్న విధంగా పరిస్థితి ఉంది. 

 


ఈ  పరిస్థితులను పూర్తిగా మార్చి వేయాలని బిజెపి ఇప్పుడు కంకణం కట్టుకుంటోంది. మొన్నటి వరకు మూడు రాజధానులు, విద్యుత్ బిల్లులు, అమరావతి వ్యవహారం వంటి విషయాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తో  కలిసి పోరాటాలు చేసినా, ఇక నుంచి మాత్రం టిడిపి వైసిపి లను ఒకే విధంగా చూడాలని, రెండు పార్టీలకు వ్యతిరేకంగా  పోరాటం చేస్తూ రాజకీయంగా పైచేయి సాధించాలనే ఆలోచనతో బిజెపి ప్రభుత్వం ఏపీ బిజెపి లో రెండు మూడు గ్రూపులు ఉండడంతో, వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీ పుంజుకునే విధంగా చేయాలని బిజెపి నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేంద్ర బిజెపి పెద్దల నుంచి ఈ మేరకు స్పష్టమైన మౌఖిక ఆదేశాలు రావడంతో బిజెపి నాయకులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. 

 


ఇకపై ప్రజా ఉద్యమాల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల తప్పులపై పోరాడే  విషయములో ఎక్కడా వెనక్కి తగ్గకూడదని ఏపీ బీజేపీ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఏ/పీలో అధికారం దక్కించుకోవాలని బిజెపి ఆశ పడడం అత్యాశ గాని ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే బిజెపికి ఏపీ లో ఉన్న కార్యకర్తల బలం ఏంటో అందరికీ తెలుసు. ఆ పార్టీలో నాయకులు తప్ప క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు అతి తక్కువ మంది అన్న సంగతి ఆ పార్టీ నాయకులకు బాగా తెలుసు. కాకపోతే ఇప్పుడు టిడిపి, వైసీపీని సమాన దృష్టితో చూడాలనుకున్న ఈ విషయంలో మాత్రం ఆ పార్టీని అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: