ఆంధ్ర అభివృద్ధికి ఆయువు పట్టు అయిన పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వటం ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుకు కాలువలు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తవ్వితే ప్రాజెక్టు పనులు చంద్రబాబు టైంలో వేగవంతం అందుకున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వైయస్ జగన్ సర్కార్ కి దాని పూర్తి చేసే అవకాశం లభించింది. దీంతో రాబోయే ఏడాది జూన్ నెలకి పోలవరం ప్రాజెక్టు ని కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీంతో యుద్ధప్రాతిపదికన జగన్ సర్కార్ పనులు ప్రారంభించిన సమయంలో ప్రాజెక్టు దగ్గర జరుగుతున్న పనులు బట్టి అంత త్వరగా పూర్తి అయ్యే పనేనా అన్న సందేహాలు తాజా పరిస్థితులు బట్టి నెలకొంటున్నాయి.

 

పూర్తి  మేటర్ లోకి వెళ్తే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలి అంటే కచ్చితంగా కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమైంది ముంపు ప్రాంతాల పునరావాసం. దీని కోసం వందల కోట్లు వేల కోట్లు ఖర్చు చేయాలని గత ప్రభుత్వం లోనే లెక్కలు తేలాయి. కానీ ఆ లెక్క ల విషయంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య గ్యాప్ నెలకొనటంతో పోలవరం ప్రాజెక్టు పనులు అటూ ఇటూ కాకుండా అయిపోతున్నాయి. సుమారు 60 వేల కోట్లు అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది.

 

అయితే ఇటువంటి సమయంలో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం కనబడటం లేదు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా పరిస్థితి చూస్తే దివాలా కి వచ్చేసింది. రాబడి ఏమీ లేదు. వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్రంలో దగ్గర లేదు. మరి ఇలాంటి సమయంలో వచ్చే జూన్ నెల కల్లా ప్రాజెక్టు పూర్తి అవడం అనేది అంత త్వరగా అవటం అనేది కలలు కనడం అవుతోందని మేధావుల అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: