మహమ్మారి కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు నుండి లాక్ డౌన్ విధించడం జరిగింది. వేగంగా ఇతర దేశాలలో వైరస్ విస్తరిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం సకాలంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇండియాలో మొదటి లోనే వైరస్ కి అడ్డుకట్ట వేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఢిల్లీ మత ప్రార్థనల వేదికగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయో ఒక్కసారిగా ఇండియా లో వైరస్ విలయతాండవం చేయడం ప్రారంభించింది. ఊహించని విధంగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటువంటి తరుణంలో గత యాభై రోజుల నుండి దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటంతో గుడి - బడి - చర్చి - మసీద్ అన్నీ మూతపడ్డాయి.

 

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తూ కొన్ని విషయాలలో సడలింపులు ఇస్తూ నిర్ణయాలు తీసుకోవడం ప్రస్తుతం జరుగుతోంది. దేశీయంగా విమానాల రాకపోకలు అదేవిధంగా అంతర్ రాష్ట్రాలలో బస్సు రాకపోకలు ఇలా రవాణా వ్యవస్థ లోను మరియు కొన్ని వ్యాపార రంగాలకు సంబంధించి వెసులుబాటు కల్పించడం జరిగింది. త్వరలోనే సినిమా షూటింగులకు కూడా ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడైతే కేంద్రం వెసులుబాటు ఆంక్షలు ఎత్తివేసే ఈ విధంగా వ్యవహరించడం జరిగిందో దేశంలో ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోయింది. ముఖ్యంగా వలస కూలీలు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా వైరస్ భయంకరంగా వ్యాపించిందని వార్తలు ప్రస్తుతం వినబడుతున్నాయి.

 

వైరస్ పరిస్థితి ఇంత ప్రమాదకరంగా దేశంలో ఉంటే మరికొన్ని రోజుల్లో గుడి - బడి - చర్చి - మసీద్ లాంటివి ఓపెన్ అవ్వటానికి కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక సర్కార్ ఆలయాలు మరియు స్కూలు ఓపెన్ చేయబోతున్నట్లు గైడ్ లైన్స్ లు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాలని దేశవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుకుంటున్నారు. గుడి - బడి - చర్చి - మసీద్ వంటి చోట ప్రజలు గుంపులు గుంపులు గా ఉండే స్థలాలు ఇవి. ఒకరికి వచ్చిన వాళ్ల ద్వారా ఇంటిలోకి వైరస్ వచ్చేస్తోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గాలని కేంద్రానికి జనాలు  దండం పెడుతున్నారు. అప్పుడు మళ్లీ మొత్తానికి లాక్ డౌన్ అంటే మా బతుకులు ఇంకేమైనా ఉందా ? దయచేసి ఆలోచించండి అని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: