తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే 'మహానాడు' కార్యక్రమం కరోనా ఎఫెక్ట్ తో జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరి లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు మాత్రమే కార్యాలయంలో ప్రవేశించి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా పాల్గొని వీక్షించారు. కార్యక్రమం మొదటిరోజు చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఒక్కొక్కరు ప్రసంగించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న టీటీడీ భూముల విక్రయాలు గురించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు.

 

ఇదే సందర్భంలో టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు  'మహానాడు' లో ప్రసంగించారు. కొత్తగా కాకుండా మళ్లీ పాత పాటే అన్నట్టుగా చంద్రబాబు ప్రసంగం ఉంది. ఆయన ఏమన్నారంటే హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరం చేశాను, ప్రపంచ పటంలో హైదరాబాద్ కి అంత పేరు రావటానికి కారణం నేనే అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. జంట నగరాలకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించాం అని ఆయన చెప్పారు. అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించామని అన్నారు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు.

 

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశామని ఆయన తెలిపారు. టిడిపి హయాంలో చేపట్టిన పదకాలు అప్పట్లో దేశానికి మార్గదర్శకం అయ్యాయని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలని వారి త్యాగాల వల్లే తెలుగుదేశం పార్టీ ఈ స్థాయికి ఎదిగింది అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. గత సంవత్సరం మర్చిపోలేని సంవత్సరం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై నాయకులపై శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని జైలుకు పంపిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.  మొత్తంమీద మహానాడు మొదటి రోజు ప్రసంగం లో చంద్రబాబు గతంలో మాదిరిగానే ప్రసంగించారు అని కొత్తదనం ఏమీ లేదని టీడీపీ కార్యకర్తలే కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: