ఇంకా తాము అధికారంలో ఉన్నామనే భావన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులకు ఇంకా పోలేనట్టుగా కనిపిస్తోంది. అందుకే అధికార పార్టీ తామే అన్నట్లుగా వ్యవహారాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రతి సంఘటనను వైసీపీ ముడిపెట్టి రాజకీయంగా దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్న అనుకూల మీడియా టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు మరింతగా కవరేజ్ ఇస్తూ వైసీపీ ప్రభుత్వం పై చులకన భావం ఏర్పడే విధంగా . చేయడంలో సక్సెస్ అవుతూ వస్తోంది. ఈ విషయం సీరియస్ గా పరిశీలించిన వైసిపి టీడీపీకి దిమ్మతిరిగే విధంగా ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

 

IHG


ముఖ్యంగా ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే విధంగా స్కెచ్ వేసింది. 23 మంది ఎమ్మెల్యేలకు గాను ఇప్పుడు 20 మంది మాత్రమే ఉన్నారు.ఆ ముగ్గురితో వ్యూహాత్మకంగా చేర్చుకోకుండానే వారితో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించింది. ఇప్పుడు మరో ముగ్గురితో రాజీనామా చేయిస్తే తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుంది అనేది వైసీపీ ప్లాన్. ఇప్పటికే టీడీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు వైసిపి వ్యూహం ప్రకారం తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వైసీపీకి దగ్గర అయ్యేందుకు మంతనాలు చేస్తున్నారు. 

 


ఆయనతోపాటు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్టు బహిరంగంగానే ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే విశాఖ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చేరికలు పూర్తవ్వగానే మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు ఎదురు చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: