నేటికాలంలో వివాహాం ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు.. కానీ పెళ్లీలు అయితే జరుగుతున్నాయి.. కానీ ఆ పెళ్లి చేసుకున్న నూతన వధువరులు ఆనందంగా ఉంటున్నారా అంటే ఇలాంటి వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చూను.. ఇక అరెంజ్ మ్యారేజ్‌ల కంటే లవ్ మ్యారేజ్‌లే అధికంగా జరుగుతున్నాయి.. ఒకరికొకరు రోజులు, సంవత్సరాలు తరబడి ప్రేమించుకుంటారు..

 

 

పెళ్లి చేసుకున్నాక ఆ ప్రేమలు ఎక్కడ పాతరేస్తున్నారో తెలియదు కానీ ప్రేమించుకున్నంత కాలం ఉన్నన్ని రోజులు కూడా కాపురాన్ని కొనసాగిస్తలేరు.. అంటే ఈ కాలంలో ప్రేమ, పెళ్లి అనేది కూడా ఒక వ్యవహారంగానే పరిగణిస్తున్నారు.. దీనిలో కూడా సౌకర్యాలు, లాభాలు వెతుక్కుంటున్నారన్న మాట.. ఇక ఎక్కడో ఒకరు మంచి భాగస్వామిని పొందుతున్నారు కానీ అందరు మాత్రం హ్యాపీ లైఫ్‌ను గడపడం లేదు..

 

 

ఇకపోతే ఒక యువకుడు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాడో, బలవంతగా చేసుకున్నాడో ఏమో తెలియదు గానీ పెళ్ళైన నాలుగు రోజులకే భార్యను విడిచిపెట్టి ఇంటినుండి జంప్ అయ్యాడు.. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే.. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వీరకుమార్ నాలుగు రోజుల క్రితం బంధువుల సమక్షంలో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కాగా వివాహం చేసుకున్న నాలుగు రోజులకే నూతన వధువుని వదిలేసి వెళ్లిపోవడం చర్చగా మారింది.

 

 

దీంతో ఆ యువతీ కాళ్ళ పారాణి ఆరకముందే  పోలీస్ స్టేషన్ మెట్లెక్కి అతడిపై కేసు నమోదు చేసింది. ఇదిలా ఉండగా ఆ వరుడికి, పెళ్లికి ముందు నుండే వేరే యువతితో ప్రేమ వ్యవహారం ఉండటం మూలంగానే ఇంట్లోంచి పారిపోయాడని యువతీ తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా వరుడు హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: