ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నిబంధనలకు పాటించని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు భారీ షాక్ ఇచ్చారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, అనుమతులకు భిన్నంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు, కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ జీవోలను సవరిస్తూ కొత్త జీవోలను అమలోకి తెచ్చారు. ప్రభుత్వం తాజాగా కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
స్కూళ్లు, కాలేజీలకు తగిన సదుపాయాలు ఉంటే మాత్రమే అనుమతులు ఇచ్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకనుంచి కాలేజీలు ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కార్పొరేట్ స్కూళ్లు నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఫీజుల నియంత్రణ లాంటి అనేక సంస్కరణలను ప్రభుత్వం చేపడుతోంది. జూనియర్ కాలేజీల్లో ప్రతి సెక్షన్ కు 40 మందిని పరిచయం చేస్తూ ప్రభుత్వం నుంచి మే 13న జీవో విడుదలైంది. 
 
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రతి ప్రైవేట్ కాలేజీలకు కనిష్టంగా 4 సెక్షన్లకు గరిష్టంగా 9 సెక్షన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. జూనియర్ కాలేజీలతో ఎంపీసీ, బైపీసీతో పాటు ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, కామర్స్ కోర్సులను కూడా నిర్వహించాలి. నిబంధనల ప్రకారం సదుపాయాలు ఉంటే మాత్రమే ప్రభుత్వం ఆ కాలేజీలకు, స్కూళ్లకు అనుమతులు ఇస్తుంది. 
 
ఇకనుంచి కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇష్టానుసారం విద్యార్థులను చేర్చుకోవడం, ప్రాథమిక సదుపాయాలు లేకుండా స్కూళ్లు, కాలేజీలను నిర్వహించటానికి కళ్లెం వేసింది. కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్ లు, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ ఫోటోలను జియో ట్యాగింగ్ ద్వారా అప్ లోడ్ చేయాలి. బోర్డు ఆ వివరాలను పరిశీలించి పబ్లిక్ డొమైన్ లో ఉంచుతుంది. బోర్డు నుంచి అనుమతులు లేకుండా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం లేదని స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: