కరోనా ను కట్టడి చేసేందుకు సుదీర్ఘకాలం లాక్ డౌన్ నిబంధనలు విధించడం ప్రభుత్వాలకు సాధ్యం కాని పని. ఇప్పటి కే అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఎంత పగడ్భందిగా లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా, కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. అలాగే అకస్మాత్తుగా దీనిని విధించడంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారంతా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలను ఎక్కువ కాలం ఇళ్లకే పరిమితం చేసి ప్రభుత్వమే వారిని ఆదుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే లాక్ డౌన్ నిబంధనలు క్రమక్రమంగా సడలిస్తూ వస్తున్నారు. ఈ సడలింపు లను ప్రజలు దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా, చాలా చోట్ల పరిస్థితి అదుపు తప్పుతోంది.

 


 ఎప్పటిలాగే జనాలు రోడ్లపై గుంపులు గుంపులుగా కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉండటం కారణంగా పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. ఇదేవిధంగా జనాలు వ్యవహరిస్తూ ఉంటే, ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి రోజు కేసుల సంఖ్య వేళల్లో ఉండగా వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయి లాక్ డౌన్  ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు అందుతున్న తరుణంలో ప్రజలు రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండకుండా చేసేందుకు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. 


సరిగ్గా ఇదే సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా పోలీసుల నిఘా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మాస్కు పెట్టుకోని వారిపై వరుసగా కేసు నమోదు చేస్తున్న పోలీసులు భౌతిక దూరం పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రోడ్లపై ఎక్కడైనా గుంపులుగా జనాలు ఉంటే వెంటనే పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. ఈమేరకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను సీసీ కెమెరాలకు జోడించి ఈ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఇకపై భౌతిక దూరం పాటించకుండా ఇష్టారాజ్యంగా, తమను ఎవరూ చూడడం లేదని జనాలు భావిస్తే పోలీస్ ట్రీట్మెంట్ అందుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: