పోలీస్ అంటే రక్షకుడు.. కానీ కొందరు మాత్రం భక్షకుల్లా మారుతున్నారు. ఆ యూనిఫాం చాటున దారుణాలు చేస్తున్నారు.. ఇలా ప్రతిదేశంలో ఉన్న పోలీసులు ప్రవర్తించడం బాధాకరం.. ఇక మనదేశంలో కంటే విదేశాల్లో ఉన్న పోలీసులు చాలా ఫాస్ట్‌గా స్పందిస్తారని అందరు అంటారు.. కానీ అంతే ఫాస్ట్‌గా ప్రాణాలు కూడా తీస్తారని ఈ ఘటన నిరూపించ బడుతుంది.. ఇకపోతే అమెరికాలో నల్లజాతీయులపై పోలీసులు చూపుతున్న వివక్ష మరోసారి వివాదస్పదమైంది. ఇప్పటికే అగ్రరాజ్యంలో ఎన్నో సార్లు నల్లజాతీయులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే..

 

 

ఇదిలా ఉండగా తాజాగా అక్కడి పోలీస్ ఓ నేరస్థుడి మెడపై కాలుతో తొక్కి చంపేశాడు. ఆ బాధితుడు ఊపిరి ఆడటం లేదంటూ ఎంత వేడుకున్నా కొంచెం కూడా కనికరించలేదట. ఇలా అంతా చూస్తుండగానే నడిరోడ్డుపై నిండు ప్రాణాన్ని తీశాడు. ఇకపోతే మిన్నెసొటా లో చోటుచేసుకున్న ఈ ఘటనతో మరోసారి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక ఆ వివరాలు చూస్తే.. ఆఫ్రికాకు చెందిన జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే వ్యక్తి ఫోర్జరీ కేసులో నిందితుడిగా గుర్తింపబడ్డాడట. ఈ క్రమంలో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఈ నేరస్దుని కోసం గత కొన్ని రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ  నేపధ్యంలో అతడు కారులో వెళ్తూ పోలీసుల కంటికి కనిపించాడు.

 

 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును ఆపి అతడిని కిందికి దిగాల్సిందిగా హెచ్చరించగా, అతను బయటకు వచ్చిన వెంటనే కిందికిపడేసి సంకెళ్లు వేశారు. అయితే ఓ అధికారి అతడి మెడపై కాలు వేసి బలంగా తొక్కిపట్టగా, అతని ఊపిరి ఆడటం లేదని చెప్పిన వినకుండా అలాగే ఉండటంతో కాసేపటికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇకపోతే ఈ ఘటనకు సంబంధించి నలుగురు పోలీసులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. కానీ నేరస్తుడైనంత మాత్రాన పోలీసులు ఇలా కాలితో తొక్కి చంపడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట...

మరింత సమాచారం తెలుసుకోండి: