దేశంలో బోరు బావిలో పడి చిన్నారి మృతి.. ఇలాంటి వార్తలు ఎన్నో వచ్చాయి.  ఆ సమయంలో రిస్క్యూ టీమ్ ఎంతో కష్టపడటం.. అదృష్టం బాగుంటే ఏ చిన్నారి బతికి బయట పడటం.. లేదా చనిపోవడం. అయితే ఇలా బోరు బావిలో పడుతున్నారు అన్నవిషయం ఇప్పటిది కాదు. ఈ విషయంపై గ్రామ స్థాయిలో ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.  బోరు వేసిన తర్వాత అది ఓకే అయితే దానికి పంప్ బిగిస్తారు.. నీరు పడకుండా దాన్ని అలాగే నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్లనే ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయి.

IHG

ఈ విషయంపై అధికారులు, సామాజిక కార్యకర్తలు గ్రామాల్లో నివసించేవారికి ఎన్నో రకాలుగా చెబుతూనే ఉన్నారు.  కానీ అవగాహన లోపం వల్లనో లేదా నిర్లక్ష్యం వల్లనో ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో పాపన్న పేట మండలం లో పొడిచన్ పల్లి గ్రామంలో బోరు బావి లో పడి న చిన్నారి సంజయ్ సాయి వర్ధన్ మృతి చెందాడు. 12 గంటల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించి నప్పటికీ ఆ బాలుడిని కపడలేకపోయారు. సాయంత్రం పూట తాత కలిసి ఇంటికెళ్తున్న సంజయ్ ప్రమాదవశాత్తు బోరు బావి లో పడ్డాడు.  చివరగా 17 అడుగుల లోతు నుండి సంజయ్ మృత దేహాన్ని ఉదయం పూట అధికారులు బయటికి తీశారు.

IHG

బాలుడిని కాపాడేందుకు సమాంతరంగా 10 అడుగుల దూరం లో 25 అడుగుల లోతు వరకు బావి తవ్వరు. అయితే 25 అడుగుల లోతులో సంజయ్ ఉంటాడు అని భావించి ఇలా చేయడం జరిగింది. కానీ సహాయక బృందాలు ఎంత గా శ్రమించినప్పటికి ఫలితం లేదు. గతంలో తమిళనాడు తిరుచ్చిలోని నడుకాట్టుపట్టి గ్రామంలో శుక్రవారం ఇంటి పెరట్లో ఆడుకుంటూ అక్కడే ఉన్న బోరుబావిలో పడిపోయిన IHG అనే రెండేళ్ల బాలుడిని ప్రాణాలతో బయటకు తీయడం సాధ్యపడలేదు.

IHG

నెల్లూరు జిల్లాలో బోరు బావిలో చిన్నారులు మోక్షిత, గోపిరాజు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయారు. మూడేళ్ల పాప చనిపోయింది. అయితే కేవలం మన నిర్లక్ష్యం వల్ల ఏమీ తెలియని అమాయక చిన్నారులు బలి అవుతున్నారని.. ఇక నుంచి బోరు గుంత వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పూర్తిగా మూసి వేయాలని అధికారుల చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: