సాధారణంగా ఎవరు అయినా రాజకీయ నాయకులు పదవులు చేపడితే అడుగు పెట్టిన వెంటనే ఆలోచించాల్సింది మావోయిస్ట్ ల గురించే. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది కచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఏ నాయకుడు అయినా సరే వారిని దృష్టి లో పెట్టుకుని రాజకీయం చెయ్యాల్సి ఉంటుంది. అది ఇప్పుడు లేదు గాని ఒక పదేళ్ళ క్రితం అయితే అలాంటి పరిస్థితి ఉండేది. అయితే అలాంటి వారిని కూడా ఎన్టీఆర్ దగ్గర చేసుకుని  దాదాపుగా ఆదరించారు. తనది కూడా నక్సల్స్ సిద్దాంతం అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రకటన ఒక సంచలనం. 

 

నక్సలైట్లు కూడా దేశ భక్తులే బ్రదర్ అంటూ ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన మాట విని అప్పటి ప్రధాని కూడా షాక్ అయ్యారు. వారి ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర ఝార్ఖండ్  తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు షాక్ అయ్యాయి. వారిని ఏ విధంగా డీల్ చెయ్యాలో అర్ధం కాక చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డాయి. ఎన్టీఆర్ ఆ ఒక్క వ్యాఖ్యతో వారిని తన వైపుకి తిప్పుకున్నారు అని అంటారు చాలా మంది. వారు ఎన్టీఆర్ విషయంలో కొన్ని సందర్భాల్లో చాలా సైలెంట్ అయ్యారని అంటారు. ఇక వారిని ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పెట్టారు. 

 

ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ మావోలు కొన్ని వర్గాలుగా విడిపోయి ఇబ్బంది పెట్టారు. పీపుల్స్ వార్ ఆయన విషయంలో కాస్త సైలెంట్ గానే ఉన్నా కొన్ని దళాలు మాత్రం ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టే విధంగానే వ్యవహరించాయి అనేది వాస్తవం. దీనిపై అప్పుడు తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి చంపాలని కూడా ఓడిస్సా దళాలు కొన్ని ఉత్తరాంధ్ర లో స్కెచ్ గీసినా సరే పటిష్ట నిఘా వ్యవస్థ ఉన్న ఎన్టీఆర్... వారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: