రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత బంధాలు బంధుత్వాలు ఉండవు. కేవలం రాజకీయం మాత్రమే ఉంటుంది. తనతో ఉన్న వాడే తన వాడు తనతో లేని వాడు పగ వాడు. అవును చాలా వరకు రాజకీయాలు ఇలాగే ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు రాజకీయం చేసే సమయంలో ఇదే విషయాన్ని గుర్తు పెట్టుకుని రాజకీయం చెయ్యాలి అనేది వాస్తవం. నేటి రాజకీయాలు అయినా కిందటి రాజకీయాలు అయినా సరే నమ్మకం అనేది రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంటుంది అనేది వాస్తవం .

 

అయితే ఎన్టీఆర్ విషయంలో అలా ఉండదు అని అంటారు కొందరు. ఆయన ఒక వ్యక్తిని బాగా బాగా అభిమానించారు అని బాగా ఆయనను దగ్గర చేసుకున్నారని అంటారు. ఆయన మాజీ మంత్రి విజయవాడ కు చెందిన దేవినేని నెహ్రు. నెహ్రు విద్యార్ధిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టారు. నెహ్రు కి అన్ని విధాలుగా ఎన్టీఆర్ సహాయ సహకారాలు అందించి ఆయనను నాయకుడిగా పైకి తీసుకొచ్చారు. నెహ్రూ లో ఉన్న ప్రతిభ ను గుర్తించిన ఆయన... కృష్ణా జిల్లా రాజకీయ౦ మొత్తం ఆయన చేతిలోనే పెట్టే వారు అని అంటారు. 

 

ప్రతీ ఒక్కటి కూడా అప్పట్లో నెహ్రునే చూసుకునే వారు. ఇక కుటుంబ విషయాల్లో కూడా కొడుకు మాదిరిగానే ఎన్టీఆర్ నెహ్రూ ని ఆదరించారు అనేది వాస్తవం. ఈ విషయం చాలా మందికి తెలియదు గాని నెహ్రూ అంటే ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేక అభిమానం అని అంటారు. అందుకే తాను ఏ ఇబ్బంది పడినా సరే ముందు నెహ్రూ కి చెప్పే వారట. ఇక ప్రతీ విషయాన్ని నెహ్రూ నుంచే తెలుసుకోవాలి అని భావించే వారట. కుటుంబ సభ్యులతో కూడా ఎన్టీఆర్ చాలా సన్నిహితంగా ఉండే వారు అని, అవినాష్ గురించి కూడా ఆయన అడిగే వారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: