రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సున్నిత విషయాల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాలి. అది ఎవరు అయినా సరే అదే విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రాజకీయాలు అనగానే అలాగే ఉంటాయి మరి. పదవిలో ఉన్న నాయకులు అయితే చాలా విషయాలను కట్టడి చేసుకోవాల్సి ఉంటుంది నాయకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత వ్యవహారాలను పరిపాలనలో జోక్యం కానీయకుండా జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అలా లేకపోతే మాత్రం ఇబ్బంది పడటం ఖాయమని  అంటారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ చేసిన తప్పు అదే అనేది చాలా మంది చెప్పే మాట. 

 

ఆయన వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకుని రాకపోయినా కొంత మంది చేసిన రాజకీయం ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది. వంగవీటి రంగా హత్య ఎన్టీఆర్ ని బాగా ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం. ఎన్టీఆర్ రాజకీయాల్లో అప్పటి వరకు ఒక స్థాయిలో ఉన్నారు. కాని ఎప్పుడు అయితే రంగా హత్య తెలుగుదేశం పార్టీ హాయంలో జరిగిందో అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ బాగా ఇబ్బంది పడ్డారు. కాపు ఓటు బ్యాంకు మొత్తం ఆయనకు దూరం అయింది అనేది వాస్తవం. ఆ హత్య జరిగిన రెండేళ్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. 

 

దానికి కారణం రంగా హత్య... అలాగే కాపు ఓటు బ్యాంకు అనేది దూరం కావడమే. ఎన్టీఆర్ ఆ విషయాన్ని చాలా వరకు గుర్తించలేదు. ఆ హత్య ఎవరు చేయించారు ఎందుకు చేయి౦చారు అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గం కాబట్టి రంగాని చంపించారు అనేది చాలా మంది అప్పట్లో జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్ళారు. ఆ హత్యలో ఎన్టీఆర్ ప్రమేయం లేదు అని చాలా మందికి తెలిసినా సరే ఆయనే చేయించారు అని చేసిన ప్రచారమే ఎన్టీఆర్ ని బాగా ఇబ్బంది పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: