ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం తెలుగుదేశం పార్టీ చీలిక.  ఆ పార్టీ రాజకీయంగా ఎంతో ప్రభావం చూపించి ఎన్టీఆర్ లేకుండా ముందుకి వెళ్ళే అవకాశం లేదు అనుకున్న పార్టీ ఒక్కసారిగా చీలిపోవడం చూసి చాలా మంది షాక్ అయ్యారు. అసలు ఆ పార్టీ ఎందుకు చీలింది చంద్రబాబు నాయుడు ఎందుకు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు అనేది చాలా మందికి స్పష్టత లేదు గాని ఎన్టీఆర్ మాత్రం ఆ సంఘటన తో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. క్రమంగా ఆయన మరణానికి అదే కారణం అని చాలా మంది అప్పట్లో వ్యాఖ్యలు కూడా చేసారు. 

 

అది పక్కన పెడితే పరిపాలనలో చంద్రబాబు ఏ విధంగా ఉన్నారు అనేది ఎన్టీఆర్ ప్రతీ సందర్భంలో ఆరా తీసారని కొన్ని సందర్భాల్లో తనకు ఉన్న సన్నిహిత నాయకుల ద్వారా బాబు పరిపాలన ఏ విధంగా ఉందని అడిగే వారని అంటారు. చంద్రబాబు తో ఎన్టీఆర్ మాట్లాడాలి అనుకున్నా తన స్థాయిని ఎక్కడ తగ్గించుకోవాలో అనే ఆవేదన తోనే ఎన్టీఆర్ మాట్లాడలేదు అని కొందరు చెప్తారు. నిజా నిజాలు ఏ విధంగా ఉన్నా సరే చంద్రబాబు కొట్టిన దెబ్బ నుంచి ఎన్టీఆర్ కి బయటకు రావడానికి సాధ్యం కాలేదు అని అంటారు. 

 

ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో తిరుగు లేదని భావించి తన పార్టీ తన చేతుల్లో నే ఉంటుంది అని భావించి చాలా మందికి అప్పుడు చాలా అవకాశాలు ఇచ్చారు. అదే ఎన్టీఆర్ ని నాశనం చేసిందని కొన్ని కొన్ని విషయాల్లో ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అని చాలా మంది అంటారు. ఆవేశం ఎన్టీఆర్ ని నాశనం చేసింది అని కొందరు అంటే ఆలోచన లేకుండా చేసిన పనులే కొంప ముంచాయి అని మరి కొందరు అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: