ప్రస్తుతం కరుణ వైరస్ ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని కోసం చాలా దేశాలలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని దేశాల్లో ఎటువంటి ప్రయోజనం లేకపోయినా..., కొన్ని దేశాల్లో మాత్రం పూర్తి విజయాన్ని సాధించాయని చెప్పవచ్చు. ఇలాంటి దేశాల్లో మొదటిగా వినిపించే పేరు న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఇంతటి విజయాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది మాత్రం ప్రజలు అని చెప్పవచ్చు. ఆ తర్వాత మాత్రం చెప్పుకోవాల్సింది ఆ దేశ ప్రధాని జేసిండ్ ఆడెర్న్. ఆవిడ ప్రతిరోజు ప్రజల ముందుకు వస్తూ దేశంలో చేపడుతున్న కరోనా చర్యలను పారదర్శకంగా ప్రజలకు సమాచారం అందజేస్తూ దేశంలో పూర్తిస్థాయి కరోనా వ్యాధి నిర్మూలనకు దోహదం చేశారు.

 

ఇకపోతే వరుసగా గత ఐదు రోజుల నుండి న్యూజిలాండ్ దేశంలో ఒక కొత్త కేసు కూడా నమోదు కాలేదంటే అక్కడ వారు ఎంతటి విజయాన్ని సాధించారు ఇట్టే చెప్పేయొచ్చు. అంతేకాదు అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చివరి పేషెంట్ కూడా డిశ్చార్జ్ కావడంతో ఆసుపత్రిలో ఒక్క కేసు కూడా లేదు ప్రస్తుతం. ఈ పరిస్థితి రెండు నెలల తర్వాత ఆ దేశంలో మొదటిసారి సంభవించింది అని ప్రభుత్వం తెలియజేసింది. నిజానికి ఆ దేశంలో కరోనా మార్చి చివరి వారంలో ప్రవేశించిన వెంటనే ఆ దేశ ప్రభుత్వం పూర్తి కార్యాచరణ సిద్ధం చేసి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని కనుగొని వారికి పరీక్షలు నిర్వహించి వారి క్వారంటైన్ లో ఉంచడం లేకపోతే వారికి తగిన జాగ్రత్తలు సూచించడం ద్వారా త్వరత్వరగా కేసులను కనిపెట్టి వారి నిర్మూలనకు ఎంతో ప్రయత్నం చేశారు.

 


నిజానికి ఆ దేశంలో నాలుగు భాగాలుగా లాక్ డౌన్ అమలు చేశారు. దేశంలోని కేసు తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ పెంచుతూ వెళ్లింది ప్రభుత్వం. దాదాపు నెల రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను ప్రకటించిన న్యూజిలాండ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పుడు కూడా అలాగే తగ్గిస్తూ వచ్చింది. అయితే న్యూజిలాండ్ దేశంలో ఇప్పటివరకు 1504 కేసులు నమోదవగా అందులో 1462 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మిగతా 21 మంది కూడా చాలా తక్కువ లక్షణాలు ఉండడంతో వారిని ఇంటికే పరిమితం చేసి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: