భారత దేశంలో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మనిషి  జీవితంలో పెను మార్పులకు కారణమవుతుంది ఈ మహమ్మారి వైరస్. ఈ మహమ్మారి వైరస్ కారణంగా వివాహాలు సరిగ్గా జరగడం లేదు కార్యకలాపాలు కూడా సాధారనంగా మాత్రమే జరుగుతున్నాయి . వివాహ విషయానికి వస్తే మాత్రం ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరగాల్సిన వివాహాలు మొత్తం కేవలం సాదా సీదాగా జరిగిపోతున్నాయి.కొన్ని  వివాహాలు ఏకంగా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అయితే తాజాగా కొత్తజంట కరోనా  వైరస్ కారణంగా పెళ్లైన కొంత సమయం లోనే క్వారంటైన్ పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 


 ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది... వివరాల్లోకి వెళితే... ఒక వ్యక్తి కారణంగా ఏకంగా  నూతన దంపతులతో పాటు వంద మందికి పైగా బంధువులు కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ పాలు  కావాల్సిన దుస్థితి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే మరి... మధ్యప్రదేశ్లో జంటకి వివాహం జరిగింది... ఇక ఈ పెళ్లికి బంధుమిత్రులు అందరూ హాజరయ్యారు. ఇదే సమయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసే వధువుకు బావ వరసయ్యే  వ్యక్తి పెళ్లి వేడుకకు హాజరు అవ్వాలి అని భావించి స్థలానికి చేరుకున్నారు. అయితే సదరు వ్యక్తికి అప్పటికే దగ్గు జలుబు లాంటి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అందరితో కలిసాడు సదరు వ్యక్తి. పెళ్లి వేడుకల్లో  బంధుమిత్రులతో ఆనందంగా గడిపాడు. 

 


 అయితే వివాహం ముందు రోజు అతనికి జలుబు దగ్గు తీవ్ర స్థాయిలో ఉండగా వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు... ఇక కరెక్ట్ గా పెళ్లి రోజే సదరు వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కరోనా బాధితుడి తో  పాటు నూతన వధూవరులు అక్కడే కొంతమంది కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్  సెంటర్ కు తరలించారు అధికారులు. మరికొంతమంది సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు కలెక్టర్ సౌరబ్ సుమన్. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎంతమందికి కరోనా వైరస్ వ్యాప్తికి కారకుడిగా మారిన సదరు వ్యక్తి పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: