కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఇండియాలో ఊహించని విధంగా రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐదు వేల నుంచి ఆరువేల మధ్య నమోదవుతున్నాయి. ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు, సడలింపు ల్లో తీసుకున్న నిర్ణయాలతో పాటు వలస కార్మికులు వల్ల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందిందని వైద్యులు అంటున్నారు. మరొక పక్క ముందు నుండి ఈ వైరస్ నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ తో పాటు ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రభుత్వాలు కూడా మార్గదర్శకాలు హెచ్చరికలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ రావటంతో ప్రస్తుతం మార్కెట్ లలో మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ ల  వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిసారి చేతులు కడిగే అవకాశం ఉండక పోవడంతో చాలావరకు సాధ్యమైనంతవరకు ప్రజలు హ్యాండ్ శానిటైజర్ ని బాగా వాడుతున్నారు.

 

పరిస్థితి ఇలా ఉండగా శానిటైజర్ ఎక్కువగా వాడటం వల్ల  ప్రమాదం పొంచి ఉంది అని నిపుణులు అంటున్నారు. శానిటైజర్ అతిగా వాడటం వల్ల స్కిన్ ఎలర్జీ లు వస్తాయని అంటున్నారు. కాబట్టి పరిశుభ్రమైన నీరు తో సబ్బుతో చేతులు కడుక్కోవడం ఉత్తమమని దానివల్ల భయం చెందాల్సిన అవసరం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. కరోనా వైరస్ విషయంలో జనం భయం ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని రోగ నిరోధక శక్తి పెంచుకునే విధంగా ఆహారపు అలవాట్లు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకుంటే చాలు అని నిపుణులు ఈ సందర్భంగా సూచించారు.

 

ఎక్కువగా రోగనిరోధకశక్తి ఉండే నిమ్మకాయ రసం తాగడం అదేవిధంగా సి విటమిన్ అధికంగా ఉండే నారింజ వంటి పండ్లను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. శీతల పానీయాలకు ఐస్‌క్రీమ్‌లు వంటి వాటికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మొత్తం మీద కరోనా భయంతో శానిటైజర్ లో అతిగా వాడటం వలన చర్మ సమస్యలు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: