ఒకపక్క మహానాడు ఘనంగా నిర్వహిస్తున్నామని గొప్పలు గట్టిగా చెప్పుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ నాయకులు వ్యవహారం మింగుడు పడడం లేదు. ఇప్పటికి నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీ కి రాజీనామా చేసి వైసిపి కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అనే వార్తల కలవర పెడుతున్నాయి. అదే కనుక జరిగితే ప్రధాన ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీ కోల్పోతుందని, అప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇప్పుడున్నంత ప్రోటోకాల్ తమకు ఉండదనే బాధలో చంద్రబాబు ఉన్నారు. అసలు పార్టీ స్థాపించిన తర్వాత ఎప్పుడూ చూడని విధంగా ఘోరమైన ఫలితాలను తెలుగుదేశం పార్టీ చూసిందని, 175 స్థానాలకు కేవలం 23 మంది గెలవడం అవమానంగా భావిస్తూ ఉండగా అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవ్వడం మరింత కంగారు పెట్టింది.

IHG
 మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం వంటివారు పార్టీకి రాజీనామా చేసి వైసిపి కి మద్దతుగా ఉంటున్నారు. వీరు కాకుండా మరో నలుగురైదుగురు ఇప్పుడు ఆ విధంగానే వైసీపీలో చేరకపోయినా బయట నుంచి టీడీపీ కి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వైసీపీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే satya PRASAD' target='_blank' title='అనగాని సత్యప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్ వంటివారు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు కాస్త మెత్తబడేలా అవకాశం కనిపిస్తున్న రేపల్లె ఎమ్మెల్యే satya PRASAD' target='_blank' title='అనగాని సత్యప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనగాని సత్యప్రసాద్ మాత్రం వైసీపీలోకి వెళ్లే విషయంలో ఎవరి మాట వినేలా కనిపించడం లేదు.


 సాక్షాత్తు అధినేత చంద్రబాబు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ త్వరలో రాజ్యసభకు వెళ్లబోతున్న నేపథ్యంలో నియోజక వర్గం లో బలమైన నాయకుడుగా ఉన్న అనగాని ని వైసీపీ కి మద్దతుగా ఉండేలా చేస్తే నియోజకవర్గంలో బలమైన బిసి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా వైసిపి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సత్యప్రసాద్ చర్చలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. వైసిపి అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటి నుంచే టిడిపి కి చెందిన నాయకులు ఎవరు లిఫ్ట్ చేయడం లేదట.
 

మరింత సమాచారం తెలుసుకోండి: