తెలంగాణ రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య తెలంగాణ సర్కార్ ఎన్నో కఠిన నిబంధనలు రాష్ట్రంలో అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లను మూసివేయటంతోపాటు సినిమా షూటింగ్ లు  అన్నింటిని నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది సర్కార్ . సినిమా థియేటర్ లలో  సినిమా షూటింగ్ లలో ఎక్కువగా సామాజిక దూరం పాటించేందుకు అవకాశం ఉండదు కాబట్టి వెంటనే వీటన్నింటినీ నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ లన్ని నిలిచిపోవడంతో  అటు సినిమా థియేటర్లు కూడా మూసివేయడంతో చిత్ర పరిశ్రమలోని చాలా మంది పరిస్థితి దీనస్థితికి చేరుకున్నాయి . ముఖ్యంగా సినీ కార్మికుల పరిస్థితి అయితే మరింత అధ్వానంగా మారిపోతుంది. 

 

 మరోవైపు సినిమా థియేటర్లు నిర్వహకుల పరిస్తితి కూడా రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎందుకంటే సినిమా థియేటర్లో సినిమా ఆడినా ఆడకపోయినా సిబ్బందికి  మాత్రం జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో కొత్త సినిమా షూటింగ్ ఆగిపోయాయి..  పాత సినిమాల విడుదల కూడా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు సినిమా షూటింగులు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంద అని  తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ విషయంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తెలుగు సినీ పరిశ్రమలోని ఎంతో మంది పెద్దలు చర్చలు జరుపుతూన్న విషయం తెలిసిందే. 

 

 

 అయితే తాజాగా ఈ విషయం పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో  టాలీవుడ్ ప్రముఖులు అందరు భేటీ అయ్యారు. సినిమా షూటింగు lu2 థియేటర్ల ఓపెనింగ్స్ పై మంత్రి తలసాని తో చర్చలు జరిపారు సినీ ప్రముఖులు. ఇక ఈ భేటీలో  నాగార్జున రాజమౌళి త్రివిక్రమ్ కొరటాల శివ సురేష్ బాబు... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సహా మరికొంత మంది హాజరయ్యారు. అయితే సరి కొత్త నిబంధనలతో సినిమా సీరియల్స్ షూటింగ్ జరుపుకునేందుకు అనుమతించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే సినిమా సెట్స్ స్టూడియోలలో సిగరెట్ తాగడానికి మాత్రం అనుమతి లేదు అని చెప్పడంతో పాటు మరి కొన్ని నిబంధనలు కూడా srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: