దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రధానంగా వలస కార్మికుల గురించి, దినసరి కూలీల గురించి చర్చ జరిగింది. కానీ మన కంటి ముందు నిత్యం కనిపించే వీధి వ్యాపారుల గురించి మాత్రం ఎటువంటి చర్చ జరగలేదు. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది వీధి వ్యాపారులు మాత్రమే. నాలుగో విడత లాక్ డౌన్ ముగుస్తున్నా వీధి వ్యాపారుల కష్టాలు మాత్రం తీరడం లేదు. గతంలోలా వీధి వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు పెట్టుకునే పరిస్థితి లేదు. మున్సిపాలిటీల పరిధిలో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా కొన్ని స్థలాలను ఫిక్స్ చేశారు. తక్కువ స్థలంలో మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో పాటు ఆ అనుమతులు కూడా గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే ఇస్తున్నారు. 
 
గుర్తింపు కార్డులు కూడా ఎవరికైతే పలుకుబడి ఉందో వారికి మాత్రమే వస్తున్నాయి. మరోవైపు వీరు రుణాల కోసం మైక్రో ఫైనాన్స్ లపై ఆధారపడుతున్నారు. వీరు మైకో ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర నగదు అప్పుగా తీసుకుని వడ్డీలు కడుతూ ఉంటారు. లాక్ డౌన్ సమయంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వీధి వ్యాపారులంతా ఆర్థికంగా దెబ్బ తిన్నారు. వీరు ఇబ్బందుల్లో ఉన్నా ప్రైవేట్ ఫైనాన్షియర్లు వడ్డీలు చెల్లించాల్సిందేనని వీరిని వేధిస్తున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల కోసం ముద్ర లోన్ లను కల్పిస్తున్నా ముద్ర లోన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్న వీధి వ్యాపారుల సంఖ్య చాలా తక్కువ. మోదీ సర్కార్ తాజా ప్యాకేజీలో వీరి కోసం వేల కోట్లు ప్రకటించినా ఆ వేల కోట్ల ద్వారా వీరికి ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో చెప్పలేము. కేంద్రం వీధి వ్యాపారులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారికి ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: