అవును అంతేగా. ఉంటామంటేనే ఉంచుకుంటారు. వెళ్తామంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు, ఇపుడు తెలుగుదేశం పార్టీలో అదే రకమైన నిర్లిప్తత కనిపిస్తోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. తెలుగు దేశం పార్టీ విషయానికి వస్తే ఎవరినీ చేజార్చుకునే విషయమే అక్కడ లేదు.

 

చంద్రబాబు అందరినీ పార్టీలో ఉంచాలనుకుంటారు. అయితే రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు. పైగా ఇపుడంతా అధికారం  వైపు సాగే రాజకీయం. అందువల్ల అధికారం పోగానే ఏదోలా ఉంటుంది. అసలు రాజకీయ జీవితం చాలా చిన్నదైపోయింది.

 

పోటీ కూడా చాలా చాలా పెరిగిపోయింది. గతంలో అయితే సుదీర్ఘకాలం జనాదరణ ఉండేది. దాంతో నాయకులు కూడా నీతిగా ఉండేవారు, ఇపుడు జనం అభిప్రాయాలు, ఆలోచనలు ప్రతీ ఎన్నికకూ మారిపోతున్నాయి. ఒకసారి ఓడితే పట్టించుకునే సీన్ లేదు. దాంతో పాటు పార్టీ అధినాయకత్వం కూడా హామీలు ఇచ్చినా చివరి నిముషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

 

దాంతో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే తీరుకు నాయకులు అలవాటు పడుతున్నారు. అది నయా పొలిటికల్ ట్రెండ్ గా చూడాలి.ఇదిలా ఉండగా టీడీపీ నుంచి ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారని వార్తలు వస్తున్నాయి. దాని మీద సంకేతాలు బయటకు కనిపించకపోయినా మహానాడులో కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు చూస్తూంటే ఏదో జరుగుతుందా అనిపించక మానదు.

 

పార్టీ అధికారంలో ఉన్నపుడు పనిచేయడం గొప్ప కాదు, కష్టకాలంలో పార్టీలో ఉండి పనిచేయడమే గొప్ప అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నది అర్ధం చేసుకోవాలి. ఇక అదే విధంగా మిగిలిన నాయకులు, అధినాయకుడు కూడా క్యాడర్నే నమ్ముకుంటున్నారు. అంటే వైసీపీలోకి తమ్ముళ్ళ జాతర మొదలవుతోందా. చూడాలి మరి.

ఏది ఏమైనా ఈ నెలాఖరుకల్లా ఏపీలో పొలిటికల్ సీన్ మారుతుందని అంతా అనుకుంటున్నారు. అదే నిజమైతే బ్లాస్ట్ అయినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: