చంద్రబాబు ఇపుడు సరైన రూట్లోకి వస్తున్నారనుకోవాలి. ఎందుకంటే ఆయన నిజాలు ఒప్పుకుంటున్నారు. గతాన్ని తలచుకుంటున్నారు. అప్పట్లో జరిగిన తప్పులను కూడా ఒకటికి పదిమార్లు నెమరువేసుకుంటున్నారు. నిజంగా ఇది సరైనా సంమీక్ష‌గానే చూడాలి.

 

రాజకీయ నాయకులకు, పార్టీలకు కావాల్సింది ఇదే. అధికారంలో ఉన్నపుడూ ఏదీ తెలియదు. అంతే కాదు తెలియనివ్వరు కూడా. అధికారం అంతే స్వీట్ ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని రకాలు చేరుతాయి. నిజం కూడా భ్రమల్లోకి పోతుంది. అబద్ధం కూడా నిజంగా ఉంటుంది.

 

మీ అంతటివారు లేరంటే ఎవరైనా పొగడ్తలకు పడిపోతారు. ఇందులో తప్పూ లేదు, ఒప్పూ లేదు. సరే ఇదంతా ఎందుకంటే చంద్రబాబు మహానాడులో తాపీగా ఒక నిజాన్ని ఒప్పుకున్నారు. అదేమంటే  తాను ముఖ్యమంత్రి సీటు శాశ్వతం అనుకున్నాను, కానీ కాద‌ని గత ఏడాది ఎన్నికలు తేల్చేసిందని కూడా వాపోయారు. 

 

నిజమే బాబే కాదు, ఆ హాట్ సీట్లో ఎవరు కూర్చున్నా కూడా  అలాగే అనిపిస్తుంది. వందిమాగధులు, భజనలు, బాజా భజంత్రీలు ఇవన్నీ కూడా హాట్ సీట్ నుంచి కదలనివ్వవు, ఇంతలో చూస్తూడగానే అయిదేళ్ళు గడచిపోతాయి. ఎన్నికలు వచ్చేస్తాయి. ఆ తరువాత కధ జనం చేతిలోకి వెళ్తుంది. వారికి ఈ భజనలు, భేషజాలు అసలు పట్టవు, తమదైన తీర్పు ఇచ్చి పారేస్తారు.

 

ఇపుడు చంద్రబాబు తాను నిజాన్ని తెలుసుకుంటూనే జగన్ని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి సీటు శాశ్వతమని జగన్ అనుకోవడం మంచిది కాదు, రేపు ఆయన కూడా దిగిపోవచ్చు అని కూడా అంటున్నారు. నిజమే ఎన్నిక అన్న తరువాత ఒకరే  ఉంటారా ఏంటి.

 

జనం నచ్చుకుంటే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ లా, పశ్చిమ బెంగాల్ దివంగత సీఎం జ్యోతీ బాస్ ల ఇరవై పాతికేళ్ల పాటు కూడా  పాలించవచ్చు గాక, కానీ ఎప్పటికైన దిగిపోవాల్సిందే. కాబట్టి సీఎం సీటు ఎవరికీ శాశ్వతం కాదు, బాబు భేషైన మాటే చెప్పారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: