2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగా ఉందన్న టాక్ బలంగా వినబడుతోంది. రెండో రోజు అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం గతంలో మాదిరిగా అదే పాట అదే తీరు అన్నట్టుగా ఉంది అన్న టాక్ పార్టీలోనే విన్నపడుతోంది. దీంతో సొంత పార్టీ నుండే కొంత అసహనం వెల్లడి అవుతున్నట్లు ఏపీ రాజకీయాలో వార్తలు జోరందుకున్నాయి. హైదరాబాద్ ప్రపంచ పటంలో  మరియు ఆర్థిక పరిస్థితిలో టీడీపీ తీసుకు వచ్చిన మార్గదర్శకాలు అంటూ చంద్రబాబు గతంలో పాడిన పాటే జరుగుతున్న మహానాడులో మళ్లీ పాడారు. మధ్య మధ్య లో కార్యకర్తల బలం అంటూ అప్పట్లో వేసిన డైలాగ్ లే చంద్రబాబు రెండో రోజు మహానాడు లో వినిపించారు.

 

మరోపక్క పార్టీ అధికారం కోల్పోయాక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఎత్తిచూపే విషయంలో మహానాడు కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని చంద్రబాబు సరైన రాజకీయ ఎత్తుగడలు వేయలేకపోయారని సొంత పార్టీలోనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. డిజిటల్ మీడియా ద్వారా మహానాడు నిర్వహించడం మినహా ఈసారి టీడీపీ మహానాడు లో పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదని చాలామంది అంటున్నారు. కరోనా కష్టకాలంలో మహానాడు నిర్వహించడం పట్ల సొంత పార్టీ నుండే విమర్శలు లోలోపల వినిపిస్తున్నాయి.

 

గ్రౌండ్ స్థాయిలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన ఉండదు. మరి అలాంటి వారిని పరిగణలోకి తీసుకోకుండా టిడిపి హైకమాండ్ నిర్వహిస్తున్న 'డిజిటల్ మహానాడు' ఎవరికి ఉపయోగం అని పార్టీ కోసం కష్టపడుతున్న వారు అంటున్నారట. ఇదే సమయంలో గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు మహానాడుకు డుమ్మా కొట్టడంతో జరుగుతున్నా డిజిటల్ మహానాడు కార్యక్రమం పస లేనట్టు ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక రెండో రోజు కూడా టీటీడీ భూముల వ్యవహారంపై అదేవిధంగా లోకల్ ఎలక్షన్ వాయిదా, నిమ్మగడ్డ రమేష్ పదవినుంచి తొలగడం పై తీవ్రస్థాయిలో టీడీపీ నాయకులు సెటైర్లు ప్రభుత్వం పై వేస్తూ చర్చలు జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: