తెలుగుదేశం పార్టీలో జోష్ పెరిగింది. ఉత్సాహంతో టిడిపి పార్టీ క్యాడర్ మహానాడు జరుపుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనల మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ మహానాడును టీడీపీ హైకమాండ్ నిర్వహిస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో మొత్తం 17 మంది హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో గతంలో ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు వ‌ల్లభ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరి, క‌ర‌ణం బ‌ల‌రాం ఆల్రెడీ వైసిపి కి జై కొట్టడం జరిగింది. అయితే తాజాగా మరో ముగ్గురు గైర్హాజరు  అవటంతో టీడీపీ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే ముగ్గురు కూడా పార్టీ మారడానికి లైన్ లో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదే గనుక జరిగితే చంద్రబాబు కి ఉన్న ప్రతిపక్ష హోదా కోల్పోవటం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది. ఈ దెబ్బతో చంద్రబాబు నేతలను బుజ్జగించే పనిలో పడ్డారట.

 

ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే తో చంద్రబాబు ఫోనులో సంప్రదిస్తున్న అటువైపు ఎమ్మెల్యే నుంచి ఎటువంటి రెస్పాండ్ రావడం లేదంట. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే యే ఈ విధంగా వ్యవహరించడంతో సదరు ఎమ్మెల్యే వ్యవహారం ప్రస్తుత మహానాడులో పెద్ద చర్చనీయాంశంగా మారింది అని సమాచారం. దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా రంగంలోకి దిగి సదరు ఎమ్మెల్యేలతో మంతనాలు జరపాలని ఫోన్ ట్రై చేస్తున్నారట.

 

అయినా కానీ రెస్పాండ్ ఏమి రావటం లేదట. ఈ దెబ్బతో ఇప్పుడు టిడిపి శ్రేణుల్లో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉందని అనుకుంటున్నారట. మరోపక్క వైసీపీ కూడా రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబుకి లేకుండా చేయాలని మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: